ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతున్న టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వీడియో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడినట్లుగా ఉన్న ఆ వీడియోలో తాను ఎక్కడికి వెళ్లానన్నది చెప్పలేదు కానీ.. బయటకు వెళ్లానని మాత్రం చెప్పారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తన ఇంటిపై జరిగిన దాడి సమయంలో  ఇంట్లోనే ఉన్న తన కుమార్తె తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయిందని.. ఓ తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించేందుకు ఆమెను తీసుకుని బయటకు వెళ్లానని స్పష్టం చేశారు. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది.



Also Read : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!


డ్రగ్స్ వల్ల ఓ తరం నిర్వీర్యం అయిపోకుండా తెలుగుదేసం పార్టీ ఉద్యమం ప్రారంభించిందని అందులో తన వంతు పోరాటం చేస్తున్నానన్నారు. తనపై నమోదైన కేసుల్లో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు లేని అర్థాలను సృష్టించారని వ్యాఖ్యాించారు. డ్రగ్స్ దందాపై తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విధ్వంసానికి దిగారని మండిపడ్డారు.  తర్వలోనే మళ్లీ వచ్చి పార్టీలో అధికార ప్రతినిధిగా క్రీయాశీలక పాత్ర నిర్వహిస్తాననని ప్రకటించారు. 


Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన ఉద్యమం ! బీజేపీ కలసి వస్తుందా ?


ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు హైకోర్టులో బెయిల్ లభించింది.  బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు. అయితే హఠాత్తుగా సోమవారం రోజున కొంత మంది సోషల్ మీడియాలో ఫోటోలను వైరల్ చేశారు. పట్టాభి విమానంలో వెళ్తున్నవి, మాల్దీవ్స్ ఎయిర్ పోర్టులో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేసి వైరల్ చేశారు. దీంతో పట్టాభి వీడియో విడుదల చేసినట్లుగా చేసినట్లుగా తెలుస్తోంది. 


Also Read : మేనిఫెస్టోలోని హామీలు వంద శాతం అమలు చేస్తున్నాం.. కిందటి ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాం


పట్టాభి మాల్దీవ్స్ వెళ్లారని ప్రచారం జరిగింది కానీ ఆయన టీడీపీ ఆఫీసు నుంచే వీడియో రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది. దేశంలో లేకపోతే టీడీపీ ఆఫీసులో ఎలా మాట్లాడతారన్నది సస్పెన్స్‌గా మారింది. ఒక వేళ తిరిగి వచ్చి ఉంటారని కొంత మంది భావిస్తున్నారు. తనపై నమోదైన అ్ని కేసుల గురించి న్యాయస్థానాల్లో తేల్చుకోవాలనుకుంటున్నారు.  


Also Read : ఏపీలో టీఆర్ఎస్‌ పోటీ ! ఆషామాషీగా కాదు వ్యూహాత్మకంగానే కేసీఆర్ అడుగులు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి