ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల పెండింగ్ కేసులకు సంబంధించి హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. దిగువ కోర్టులో విచారణలో ఉన్న 12 చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న పలు సంస్థలు, వ్యక్తులు తమపై నమోదైన కేసులను కొట్టేయాలని, స్టే ఉత్తర్వులు పొడిగించాలని కోరుతూ రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై రోజువారీగా విచారణ చేపడతామని న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.

 


పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వినోద్‌ దేశ్‌పాండే, టీ నిరంజన్‌రెడ్డి, శివరాజ్‌ శ్రీనివాస్‌, నవీన్‌కుమార్‌లు వాదనలు వినిపిస్తూ.. స్టే ఉత్తర్వుల గడువును వారం రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది. జగన్‌ కంపెనీల్లో హెటిరో, అరబిందో కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని ఆరోపిస్తూ సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులు కొట్టేయాలని కోరుతూ ఆ కంపెనీలు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశాయి.


సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్లతో సహా 2012 నుంచి దాఖలైన సుమారు 40 వ్యాజ్యాలను నేటి విచారణ జాబితాలో ఉన్నత న్యాయస్థానం చేర్చింది. పలు పిటిషన్లపై జరిగిన విచారణలో వారం రోజులు గడువు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ఈ కేసులు చాలా కాలంగా పెండింగ్​లో ఉన్నాయని ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వ్యాజ్యాలు త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని న్యాయమూర్తి గుర్తు చేశారు. న్యాయవాదులు వాదనలకు సిద్ధంగా ఉండాలని.. కేసుల వారీగా పిటిషన్లపై రోజూ విచారణ చేపడతాని పేర్కొన్నారు.


Also Read: Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్


Also Read: Sajjala : కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చు.. విడిపోతే ఏపీ చీకట్లోకి వెళ్లిపోతుందని చెప్పామన్న సజ్జల !


Also Read: Budvel Campaign End : బద్వేలులో ప్రచారంతోనే తేలిపోయిన ఫలితం.. గట్టి పోటీ ఇస్తామంటున్న బీజేపీ, కాంగ్రెస్ !


Also Read: Ola Electric Scooter: అమ్మకాల్లో ఓలా స్కూటర్ రికార్డు.. మొత్తం టూవీలర్ ఇండస్ట్రీనే మించేలా.. ఎన్ని అమ్ముడుపోయాయంటే?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి