ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే కనిపించినా మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 567 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 7 మంది కొవిడ్19 మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,61,959 పాజిటివ్ కేసులకు గాను.. 20,42,818 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ 14,364 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,777 అని ఏపీ వైద్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది.






గడిచిన 24 గంటల్లో దాదాపు 39 వేల పైగా శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 567 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,61,959కు చేరుకుంది. ఏపీలో నిన్న ఒక్కరోజులో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీ కేసులు తక్కువగా ఉన్నాయి. అయినా రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది.


Also Read: ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఖాతాలు తొలగించాక... ఏకంగా 31 కిలోలు తగ్గిందట ఈ అమ్మడు






ఏపీలో మొత్తం 2,93,65,385 (2 కోట్ల 93 లక్షల 65 వేల 385) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... నిన్న ఒక్కరోజులో 39,545 శాంపిల్స్‌ పరీక్షలు చేశారు. చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనాతో చనిపోయారు. నిన్న ఒక్కరోజులో 437 మంది కొవిడ్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. 


Also Read: రోజూ తాగుతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ


ఏపీలో నిన్న అత్యధికంగా తూర్పు గోదావరిలో 161 మంది కరోనా బారిన పడ్డారు. చిత్తూరులో 94, కృష్ణాలో 84, గుంటూరులో 47 మందికి కరోనాగా నిర్ధారించారు. కర్నూలులో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. శ్రీకాకుళంలో 6, అనంతపురంలో 8, విజయనగరంలో 13 మంది కొవిడ్ బారిన పడ్డారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి