నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన జరిగింది. వెంకటాచలంలోని అక్షర విద్యాలయాన్ని వెంకయ్యనాయుడు, అమిత్ షా సందర్శించారు. అక్షర విద్యాలయంలో ట్రైనింగ్ సెంటర్ సోమా సెంటర్, ముప్పవరం ఫౌండేషన్, ఎల్వీఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ఉప రాష్ట్రపతితో కలిసి హోం మంత్రి అమిత్ షా పరిశీలించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు.


రాజకీయ నాయకులు అన్నదాతలైన రైతులపై ఎక్కువగా దృష్టిపెట్టాలని వెంకయ్య నాయుడు సూచించారు. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలని.. వారికి ఆ యువతకు శిక్షణ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలని అన్నారు. ఆ యువతకు తగినంత ప్రోత్సాహకం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని వెంకయ్య అన్నారు. మహిళలు ఇంకా చాలా అంశాల్లో ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వారసత్వంగా వచ్చే ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించాలన్నదే తన కోరిక అని ఉప రాష్ట్రపతి అన్నారు. మాతృభాష, మాతృభూమిని మర్చిపోవద్దని.. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని అన్నారు. సొంత ప్రాంతంలో, సొంత భాషలో మాట్లాడుతూ.. పుట్టిన ఊరి గాలి పీలుస్తూ.. సొంత ప్రాంత భోజనం తింటుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందని వెంకయ్య నాయుడు మాట్లాడారు.


Also read: ABP-CVoter Survey: యూపీ భాజపాకే.. కానీ 100 సీట్లు హాంఫట్.. పంజాబ్‌లో ఒకటి కూడా కష్టమే!


స్వర్ణ భారత్ ట్రస్టు గురించి మాట్లాడుతూ.. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో సేవాలయానికి వెళ్తే కూడా అంతే పుణ్యం వస్తుందని వెంకయ్య నాయుడు అన్నారు. సేవే అసలైన తన మతమని తాను గాఢంగా నమ్ముతానని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్‌ ట్రస్టును పరిశీలించాలని ఎంతో మందిని తాను ఆహ్వానిస్తుంటానని అన్నారు. తాను గతంలో ఏ పదవిలో ఉన్నా.. భవిష్యత్తులో ఎక్కడ ఉన్నా.. ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటానని వెంకయ్య అన్నారు. స్వర్ణ భారత్‌ ట్రస్టు ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా ఉందని అభినందించారు. తెలుగు భాష రక్షణ కోసం ట్రస్టు ప్రయత్నిస్తోందని వివరించారు. గ్రామీణ మహిళలకు ఒకేషనల్‌ కోర్సుల కోసం కొత్త భవనం అందుబాటులోకి తెచ్చామని వివరించారు.


వెంకయ్యకు సంక్షేమంపైనే ధ్యాస
అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడును ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే వెంకయ్య.. కేంద్రమంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక పదవులు చేపట్టారని ప్రతి చోటా ఆ పదవికే వన్నె తెచ్చారని అన్నారు. వివిధ రంగాల్లో వెంకయ్య నాయుడు చేసిన కృషిని కొనియాడారు. వెంకయ్య ఏ కార్యక్రమం చేపట్టినా.. రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థుల కోసమే ఆలోచిస్తుంటారని అన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏరి కోరి గ్రామీణాభివృద్ధి శాఖను ఎంపిక చేసుకున్నారని అన్నారు.


Also Read: Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి


Also Read: Amit Shah Andhra Visit: 'ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.. నా కోరిక నేటికి నెరవేరింది'


Also read:  తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి