ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
వెంకయ్య విద్యార్థి స్థాయి నుంచే నాయకుడిగా ఉన్నారు. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఎన్నో ఉన్నతస్థాయి చర్చల్లో వెంకయ్య చురుగ్గా పాల్గొన్నారు.
రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని వెంకయ్య పరితపిస్తుంటారు. మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ ఎంచుకున్నారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థుల కోసమే ఆలోచించేవారు. వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న నా అభిలాష నేటికి నెరవేరింది. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
Also Read: Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి
Also read: ABP-CVoter Survey: యూపీ భాజపాకే.. కానీ 100 సీట్లు హాంఫట్.. పంజాబ్‌లో ఒకటి కూడా కష్టమే!
Also read: తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?
Also read: గోల్డెన్ అవర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...
Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి