ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే! చిరకాల వన్డే శత్రువులైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సాయంత్రం తలపడుతున్నాయి. దుబాయ్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ కాబట్టి అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కఠినమైన ఈ పిచ్‌పై టాస్‌, పవర్‌ప్లే అత్యంత కీలకం కానున్నాయి. దాదాపుగా టాస్‌ గెలిచిన జట్లే విజయాలూ అందుకున్నాయి. లక్ష్య ఛేదనకు దిగిన జట్లకే పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు దుబాయ్‌లో 12 మ్యాచులు జరగ్గా ఏ జట్టు పవర్‌ప్లేలో ఎలా ఆడిందో చూద్దాం..!



  • వెస్టిండీస్‌ x ఇంగ్లాండ్‌:  ఆంగ్లేయులు ఛేదనకు దిగారు. ఆరు వికెట్ల తేడాతో గెలిచారు. మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ పవర్‌ప్లేలో 4 వికెట్లు నష్టపోయి 31 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌ 39/3 చేసింది.

  • భారత్‌ x పాకిస్థాన్‌: పాక్‌ ఛేదనకు దిగింది. పది వికెట్ల తేడాతో గెలిచింది. పవర్‌ప్లేలో భారత్‌ 36/3తో నిలిస్తే పాక్‌ 43/0తో రాణించింది.

  • వెస్టిండీస్‌ x దక్షిణాఫ్రికా: సఫారీలు రెండో బ్యాటింగ్‌ చేసి ఎనిమిది వికెట్లతో గెలిచారు. మొదట విండీస్‌ పవర్‌ప్లేలో 43/0తో ఉంటే దక్షిణాఫ్రికా 42/1తో నిలిచింది.

  • శ్రీలంక x ఆస్ట్రేలియా: ఆసీస్‌ ఛేదన చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక పవర్‌ప్లేలో 53-1తో ఆసీస్‌ 63-0తో నిలిచాయి.

  • అఫ్గానిస్థాన్‌ x పాకిస్థాన్‌: పాక్‌ రెండో బ్యాటింగ్‌ చేసి 5 వికెట్లతో గెలిచింది. పవర్‌ప్లేలో అఫ్గాన్‌ 49-4, పాక్ 38-1తో నిలిచాయి.

  • ఆస్ట్రేలియా x ఇంగ్లాండ్‌: ఆంగ్లేయులు ఛేదనకు దిగి 8 వికెట్ల తేడాతో గెలిచారు. పవర్‌ప్లేలో ఆసీస్‌ 21-3, ఇంగ్లాండ్‌ 66-0తో నిలిచాయి.

  • భారత్‌ x న్యూజిలాండ్‌: కివీస్‌ రెండో బ్యాటింగ్‌ చేసి 8 వికెట్లతో గెలిచింది. పవర్‌ప్లేలో భారత్‌ 35-2, కివీస్‌ 44-1తో నిలిచాయి.

  • న్యూజిలాండ్‌ x స్కాట్లాండ్‌: న్యూజిలాండ్‌ మొదట బ్యాటింగ్ చేసింది. 16 పరుగులతో గెలిచింది. పవర్‌ప్లేలో కివీస్‌ 52-2, స్కాట్లాండ్‌ 48-1తో నిలిచాయి.

  • బంగ్లాదేశ్ x ఆస్ట్రేలియా: ఆసీస్‌ రెండో బ్యాటింగ్‌ చేసి 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. పవర్‌ప్లేలో బంగ్లా 33-2, ఆసీస్‌ 67-2తో ఉన్నాయి.

  • స్కాట్లాండ్‌ x భారత్‌: భారత్‌ ఛేదనకు దిగింది. 8 వికెట్ల తేడాతో గెలిచింది. పవర్‌ప్లేలో స్కాట్లాండ్‌ 27-2, ఇండియా 82-2తో నిలిచాయి.

  • నమీబియా x భారత్‌:  టీమ్‌ఇండియా ఛేదనకు దిగి 9 వికెట్లతో గెలిచింది. పవర్‌ప్లేలో నమీబియా 34-2 చేస్తే భారత్‌ 54-0తో నిలిచింది.

  • పాకిస్థాన్‌ x ఆస్ట్రేలియా: సెమీస్‌లో ఆసీస్‌ భారీ ఛేదనకు దిగి 5 వికెట్లతో విజయ దుందుభి మోగించింది. పవర్‌ప్లేలో పాక్‌ 47-0, ఆసీస్‌ 52-1తో నిలిచాయి.


Also Read: T20 World Cup 2021: మీమ్‌ క్రియేటర్లకు షాక్‌..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!


Also Read: CK Nayudu: 50 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ.. 62 ఏళ్లప్పుడు చివరి మ్యాచ్, క్రికెట్ చరిత్రలో సీకే నాయుడు ఒక శిఖరం


Also Read: AUS Vs NZ: దుబాయ్ స్టేడియంలో సెంటిమెంట్ ఇదే.. 17 మ్యాచ్‌ల్లో 16 సార్లు.. కేవలం చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే!


Also Read: Shahid Afridi on Virat Kohli: కోహ్లీ అన్నింట్లో కెప్టెన్సీ వదిలేస్తే మంచిది.. రోహిత్‌కు అఫ్రిది మద్దతు


Also Read: Rohit Sharma 264: ఆ ‘264’కు ఏడేళ్లు.. ఆ రోజు రోహిత్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి