టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆదివారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ గ్రౌండ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే 99 శాతం మ్యాచ్ గెలిచినట్లే. గణాంకాలు ఈ విషయాన్ని చాలా క్లియర్‌గా చెబుతున్నాయి.


దుబాయ్ స్టేడియంలో రాత్రిపూట జరిగిన గత 17 మ్యాచ్‌ల్లో 16 సార్లు టార్గెట్ ఛేజ్ చేసిన జట్లే గెలిచాయి. వీటిలో తొమ్మిది టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు కాగా, మిగతావి ఐపీఎల్ మ్యాచ్‌లు. ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే మొదట బ్యాటింగ్ చేసి ఈ స్టేడియంలో విజయం సాధించింది.


గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా కూడా దుబాయ్‌లోనే విజయం సాధించింది. నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయాల్సిన దశలో గెలుపు అసాధ్యంగా కనిపించగా.. ఆస్ట్రేలియా బ్యాటర్లు వేడ్, మార్కస్ స్టోయినిస్ కేవలం మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేశారు.


ఈ మ్యాచ్‌లో కూడా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే గెలుపు రేసును 10 అడుగుల ముందు నుంచి ప్రారంభించినట్లే. అయితే రెండో సెమీస్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కనిపించలేదు. కాబట్టి మొదటిసారి బ్యాటింగ్ చేసే వారికి గతంలో కంటే అవకాశాలు మెరుగైనట్లే.


ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో కాస్త హాట్ ఫేవరెట్‌లా కనిపిస్తుంది. గత మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడ్డాక కూడా స్టోయినిస్, వేడ్ కలిసి మ్యాచ్‌ను ముగించడం వారి బ్యాటింగ్ ఆర్డర్ లోతు ఎంతో తెలియజేస్తుంది. అయితే మరోవైపు న్యూజిలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు.


చూడటానికి అండర్‌డాగ్‌లా కనిపిస్తూనే పెద్ద జట్లకు షాకివ్వడం న్యూజిలాండ్ ప్రత్యేకత. భారత్, ఇంగ్లండ్ లాంటి జట్లు కూడా ఈ టోర్నీలో న్యూజిలాండ్ చేతిలో ఓడాకనే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కాబట్టి ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేసినా భారీ మూల్యం చెల్లించక తప్పదు.


Also Read: మొదటిసారి ఫైనల్స్‌కు న్యూజిలాండ్.. బై.. బై.. ఇంగ్లండ్


Also Read: క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !


Also Read:  'హిట్‌ మ్యాన్‌' శకం మొదలు..! కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. కివీస్‌ సిరీసుకు జట్టు ఎంపిక


Also Read: కేన్ మామ వర్సెస్ డేవిడ్ భాయ్.. అరెరే.. పెద్ద సమస్యే వచ్చి పడిందే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి