టీమ్‌ఇండియా తర్వాతి టీ20 సారథిగా రోహిత్‌ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. కేఎల్‌ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. త్వరలో జరిగే న్యూజిలాండ్‌ టీ20 సిరీసుకు భారత జట్టును ప్రకటించింది. అలాగే దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్-ఏ జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్సీ నుంచి దిగిపోయిన విరాట్‌ కోహ్లీ, సీనియర్‌ పేసర్లు మహ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. హార్దిక్‌ పాండ్య, శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేయలేదు.


న్యూజిలాండ్‌ సిరీసుకు ఎంపిక చేసిన 16 మందిలో ఇండియన్‌ ప్రీమియర్ లీగులో రాణించిన ఆటగాళ్లు చోటు దక్కింది. చెన్నై తరఫున పరుగుల వరద పారించిన రుతరాజ్‌ గైక్వాడ్‌, ఫిట్‌నెస్ పెంచుకొని ఫామ్‌లోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి వచ్చారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో పవర్‌ప్లేలో దంచికొట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌కు చోటు లభించింది. అనుకున్నట్టుగానే బౌలింగ్‌లో రాణించిన హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌ను ఎంపిక చేశారు.  హైదరాబాదీ యువ కెరటం మహ్మద్‌ సిరాజ్‌ జట్టులోకి వచ్చాడు.






భారత జట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌)
కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌)
రుతురాజ్‌ గైక్వాడ్‌
శ్రేయస్‌ అయ్యర్‌
సూర్యకుమార్‌ యాదవ్‌
రిషభ్ పంత్‌ (వి.కీ)
ఇషాన్‌ కిషన్‌ (వి.కీ)
వెంకటేశ్‌ అయ్యర్‌
యుజ్వేంద్ర చాహల్‌
రవిచంద్రన్‌ అశ్విన్‌
అక్షర్ పటేల్‌
అవేశ్‌ ఖాన్‌
భువనేశ్వర్‌ కుమార్‌
దీపక్‌ చాహర్‌
హర్షల్‌ పటేల్‌
మహ్మద్‌ సిరాజ్‌


ప్రపంచకప్‌ నుంచి న్యూజిలాండ్‌ నేరుగా భారత్‌లో అడుగు పెడుతుంది. మూడు వన్డేలు, టెస్టు సిరీసు ఆడనుంది. జైపుర్‌ వేదికగా నవంబర్‌ 17న మొదటి టీ20, రాంచీలో 19న రెండో మ్యాచ్‌, కోల్‌కతాలో 21న మూడో పోరు జరుగుతుంది. ఆ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌ మొదలవుతుంది.


చాన్నాళ్లుగా భారత్‌ ఏ పర్యటనలు జరగలేదు. కరోనా వైరస్‌ వల్ల షెడ్యూల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. తిరిగి ఇప్పుడే భారత్‌-ఏ జట్టును దక్షిణాఫ్రికాకు పంపిస్తున్నారు. బ్లూమ్‌ఫోంటీన్‌ వేదికగా భారత్‌.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. కెప్టెన్‌గా ప్రియాంక్‌ పంచల్‌ ఎంపికయ్యాడు. పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, దేవదత్‌ పడిక్కల్‌, సర్ఫరాజ్‌ ఖాన్, బాబా అపరాజిత్‌, ఉపేంద్ర యాదవ్, కే గౌతమ్‌, రాహుల్‌ చాహర్‌, సౌరభ్‌ కుమార్‌, నవదీప్‌ సైని, ఉమ్రాన్‌ మాలిక్‌, ఇషాన్‌ పోరెల్‌, అర్జాన్ నాగ్వాస్‌ వాలా జట్టులో ఉన్నారు.


Also Read: Ravi Shastri Coaching Record: ఇదీ రవిశాస్త్రి అంటే..! మీమ్‌ క్రియేటర్లూ.. మీకు తెలియని శాస్త్రిని చూడండి ఓసారి..!


Also Read: T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ముందుగానే నిష్క్రమించటానికి ప్రధాన కారణాలేంటి?


Also Read: Team India 'RRR' Glimpse: టీమ్‌ఇండియా క్రికెట్‌ చరిత్రలో సరికొత్తగా 'RRR' శకం..! ఎవరీళ్లు? ఏం చేస్తారు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి