బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని 2014లోనే వచ్చిందని ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నా వెనక్కి తగ్గడం లేదు. తను అన్న మాటల్లో తప్పు ఉంటే నిరూపించాలని ..అలా చేస్తే తన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేసి క్షమాపణలు చెబుతానని అంటున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న తర్వాత కంగనా రనౌత్ ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో దేశ స్వాతంత్ర్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి దుమారం రేపాయి. 


Also Read : ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పర్యటన.. గంటన్నర కోసం రూ.23 కోట్ల ఖర్చు! బీజేపీ ప్లాన్ ఏంటి?


కంగన రనౌత్ దేశ స్వాతంత్ర్య సమరయోధులందర్నీ అవమానించారని .. దేశాన్ని కించపరిచారని వెంటనే ఆమె వద్ద నుంచి పద్మశ్రీని వెనక్కి తీసుకుని కేసులు పెట్టాలన్న డిమాండ్లు వినిపించాయి. చివరికి కొంత మంది బీజేపీ నేతలు కూడా కంగనా వ్యాఖ్యలను ఖండించారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలను ఎప్పుడూ వెనక్కి తీసుకునే అలవాటే లేని కంగనా రనౌత్ .. ఎంత దుమారం రేగుతున్నా.. తన మాటలకే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అంతే కాదు కావాలంటే తనతో వాదించి.. తప్పని నిరూపించాలని అంటున్నారు. 


Also Read : 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'


తన మాటలకు మద్దతుగా ఓ పుస్తకంలోని మాటలను కోట్ చేస్తూ 1857లో మొదటి సారి స్వాతంత్ర్యం కోసం కలెక్టివ్‌గా ఫైట్ జరిగిందన్నారు. సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మిబాయ్, వీరసావర్కర్ వంటి వంటి వారిని తాను అగౌరవపరచలేదన్నారు. వారందరూ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. తనకు 1857లో జరిగిన పోరాటం గురించి తెలుసుకానీ 1947లో జరిగిన పోరాటం గురించి తెలియదని చెప్పుకొచ్చారు. అప్పట్లో బ్రిటిష వాళ్లు మనకు భిక్షగా స్వాతంత్ర్యం వేసి వెళ్లిపోయారనేది కంగనా రనౌత్ అభిప్రాయం.


Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?


తాను వాస్తవమైన స్వాతంత్ర్యం గురించి చెప్పానని .. అప్పటి వరకూ బ్రిటిష్ తరహా పాలనలో ఉన్నానని చెప్పానని ఆమె వాదిస్తున్నారు. కంగనా రనౌత్ దేశాన్ని సైతం కించ పరుస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. కొంత మంది బీజేపీ నేతలు కూడా కంగనా వ్యాఖ్యలను ఖండిస్తున్నపప్పటికీ.. ఆమె మాటలకు సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నవారు కూడా ఉన్నారు. అందుకే ఆమెతనతో వాదనకు రావాలని చాలెంజ్ చేస్తున్నారు. 


Also read: Srinagar Encounter: కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి