India Coronavirus Updates: కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకున్నప్పటికీ దేశంలో పూర్తి స్థాయిలో నియంత్రణ జరగలేదు. ఇటీవల పదివేలకు దిగువన నమోదుకావడంతో కొవిడ్19 వ్యాప్తి తగ్గిందని భావించాం. కానీ పలు దేశాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని గమనించాలి. దేశంలోనూ కరోనా కేసులలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,850 కొత్త కేసులను నిర్ధారించారు. నిన్న ఒక్కరోజులో 555 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. క్రితం రోజుతో పోల్చితే కొవిడ్ మరణాలు సైతం భారీగా పెరిగాయి. దేశంలో ఇప్పటివరకూ 4,63,245 మంది మహమ్మారికి బలయ్యారు. 


భారత్‌లో ప్రస్తుతం 1,36,308 (ఒక లక్షా 36 వేల 308) యాక్టివ్ కేసులున్నాయి. కాగా, గత 274 రోజులలో ఇవే అతి తక్కువ క్రియాశీల కేసులు. మరోవైపు నిన్న ఒక్కరోజులో 12,403 మంది కరోనా మహమ్మారిని జయించారు. ఓవరాల్‌గా 3.44 కోట్ల మందికి కరోనా సోకగా.. ఇప్పటివరకూ 3.38 కోట్ల మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. దాంతో కొవిడ్19 రికవరీ రేటు 98.26 శాతానికి చేరింది. కరోనా మరణాలు 1.35 శాతానికి చేరుకున్నాయి. మొత్తం కరోనా కేసులలో యాక్టివ్ కేసులు 0.40 శాతం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో ప్రకటించింది. 
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?






దేశంలో నిన్న ఒక్కరోజులో 58,42,530 (58 లక్షల 42 వేల 530) డోసుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకూ భారత్‌లో 1,11,40,48,134 (111 కోట్ల 40 లక్షల 48 వేల 134) డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ జరిగినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. దేశంలో నమోదవుతున్న కేసులలో సగానికి పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా వ్యాప్తిలో కేరళ అగ్రస్థానంలో ఉంది. అమెరికా, యూరప్ దేశాలలో కరోనా వ్యాప్తి అధికం కావడం, మరణాలు పెరగడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. థర్డ్ వేవ్ రాకుండా ఉండటంలో భాగంగా కరోనా వ్యాక్సినేషన్ వేగంగా చేస్తూనే, పరీక్షలు సైతం ఎక్కువగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: ఉప్పుతో మెదడుకు ముప్పు? షాకింగ్ విషయాలు బయటపెట్టిన తాజా అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి