ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన నిరాహార దీక్షను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. సుమారు 58 రోజులు ఆహారం ముట్టకుండా ఆయన ప్రభుత్వంతో పోరాడారు. చివరికి తన ప్రాణాలనే త్యాగం చేశారు. దీర్ఘకాలంగా ఆహారం తీసుకోకపోవడం వల్లే ఆయన కన్నుమూశారని వైద్యులు సైతం దృవీకరించారు. ఇటీవల యూకేకు చెందిన వైద్యులు ఆహారం తీసుకోకపోవడం లేదా నిరాహార దీక్ష చేయడం వల్ల శరీరంలో జరిగే మార్పులు గురించి వివరించారు. ఒకటి లేదా రెండు రోజులు ఆహారం తినకుండా ఉపవాసం చేయడం మంచిదే. కానీ, కొన్ని రోజులపాటు ఆహారం తినకుండా ఉంటే మాత్రం.. మన శరీరం మనల్నే తినేస్తుందని హెచ్చరించారు. దీన్నే ‘కన్నిబాల్ ప్రాసెస్ ఆఫ్ స్టార్వేషన్’ అంటారని తెలిపారు. 


స్టార్వేషన్ అంటే.. ఆకలి మరణం. నీరు, ఆహారం లేకుండా జీవించడం వల్లే ఇది ఏర్పడుతుంది. కొన్ని రోజులపాటు ఆహారం తినకపోవడం శరీరం లోపల జరిగే పరిణామాలు భయానకంగా ఉంటాయి. శరీరం స్వీయ నరమాంస భక్షకుడిగా మారుతుంది. దీన్నే ‘కన్నిబాల్’ ప్రక్రియ అంటారు. అంటే.. మన శరీరాన్ని శరీరమే ఆహారంగా చేసుకోవడం అని అర్థం. 


ఎన్ని రోజులు జీవింవచ్చు?: నిపుణులు, పలు అధ్యయనాలు తెలిపిన వివరాల ప్రకారం.. మనుషుల ఆరోగ్యం, వయస్సు, ఆరోగ్య పరిస్థితులను బట్టి 20 నుంచి 40 రోజలు వరకు ఆహారం లేకుండా జీవించే అవకాశం ఉంటుంది. జన్యు నిపుణుడు ఎల్లి బస్బీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘మీకు ఆహారం అందుబాటులో లేనప్పుడు తనంతట తానే శక్తిని తయారు చేసుకొనే యంత్రాంగం మన శరీరంలో ఉంది. మన శరీరంలో కొవ్వు కరిగించుకుని శక్తిగా మార్చి మనల్ని సజీవంగా ఉంచుతుంది. దీన్ని ‘కీటోన్స్’ లేదా ‘కీటోసిస్’ అని అంటారు. 12 నుంచి 24 గంటల ఉపవాసం తర్వాత కొవ్వులు కీటోసిస్‌గా మారుతాయి. ఆహారం లేకపోవడం లేదా గ్లైకోజెన్ నిల్వలు అడుగంటిన తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుంది. అప్పుడే మీకు ఆకలి వేస్తుంది. దీనికి సంబంధించిన సంకేతాలను మెదడుకు పంపి.. ఆహారం తినేందుకు ప్రేరేపిస్తుంది. కీటోసిస్‌ అనేది కేవలం జీవక్రియ.. ఆహారం కాదు’’ అని తెలిపారు. 


‘‘కెటోజెనిక్ ఆహారం.. శరీరాన్ని కార్బోహైడ్రేట్ తీసుకోవడాన్ని పరిమితం చేస్తూ కీటోసిస్‌ను ప్రేరేపిస్తుంది. కాబట్టి మీ శరీరం కార్బోహైడ్రేట్‌లకు బదులుగా శక్తి కోసం కీటోన్‌లను అందించడానికి కొవ్వును బర్న్ చేస్తుంది. అయితే, ఈ ప్రక్రియ శరీరానికి మంచిదే. కనీసం ఒక రోజు ఉపవాసం ఉంటే శరీరానికి మేలే జరుగుతుంది. కానీ, ఎక్కువ రోజులు ఆహారం లేకుండా ఉంటే మాత్రం ప్రమాదమే. శరీరంలో కీటోసిస్‌లో ఉన్నప్పుడు ఆహారం లేకుండా కొన్ని రోజులు జీవించవచ్చు. ఇది మీ కొవ్వు నిల్వలపై ఆధారపడి ఉంటుంది’’ అని బస్బీ తెలిపారు.


ఎక్కువ రోజులు ఆహారం తీసుకోకపోతే.. ‘కీటోయాసిడోసిస్‌’ ఏర్పడుతుంది. అంటే కీటోన్లు ప్రమాదకరమైన లేదా ప్రాణాంతకమైన అసాధారణంగా స్థాయికి చేరుకొనే పరిస్థితి. దీనివల్ల రక్తం ఆమ్లంగా మారుతుంది. శరీరంలో కొవ్వు అడుగంటిన తర్వాత.. కండరాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియ మొదలవుతుంది. దీని వల్ల రక్త ప్రవాహంలోకి అమైనో ఆమ్లాలు, లాక్టేట్‌లు విడుదల అవుతాయి. ఉపవాసం కొనసాకే కొద్ది.. కిటోయాసిడోసిస్ కూడా పెరుగుతూనే ఉంటుంది. 20 నుంచి 30 రోజుల తర్వాత ఇది గరిష్ట స్థాయికి చేరుతుంది. 


Also Read: ఉప్పుతో మెదడుకు ముప్పు? షాకింగ్ విషయాలు బయటపెట్టిన తాజా అధ్యయనం


ఉపవాసం తర్వాత శరీరం ఆకలి నుంచి కోలుకోగలదా?: కొన్ని రోజులపాటు ఆహారం తీసుకోకపోయినా తిరిగి ఆకలి నుంచి కోలుకోడానికి శరీరానికి అవకాశం ఉంది. అయితే, శరీరానికి ఎన్ని రోజులుగా ఆహారం, నీరు లేకుండా పోయిందనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే కోలుకొనే అవకాశం ఉండదు. ఇందుకు కొన్ని రోజులు, వారాలు పట్టవచ్చు. కొంతమందికి హాస్పిటల్ ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. పరిస్థితి ‘కీటోయాసిడోసిస్’ వరకు చేరితే.. కార్బోహైడ్రేట్లను అందించడం ద్వారా బాధితుడికి తిరిగి ఆరోగ్యాన్ని అందించవచ్చు. అయితే, బాధితుడిలో ‘రీఫీడింగ్ సిండ్రోమ్’ ఏర్పడే ప్రమాదం ఉంది. శరీరంలోకి గ్లూకోజ్ తిరిగి ప్రవేశించడం వల్ల శరీరంలోని ద్రవాలు, ఎలక్ట్రోలైట్‌ల సమతుల్యతలో తీవ్రమైన మార్పులు ఏర్పడతాయి. దానివల్లే ‘రీఫీడింగ్ సిండ్రోమ్’ ఏర్పడుతుంది. ఇందుకు వైద్యులు బాధితుడిలోని ఎలక్ట్రోలైట్ స్థాయిలను నిశితంగా పరిశీలించాలి. అవసరమైతే వాటిని సరిచేయాల్సి ఉంటుంది. కొన్ని ఇన్సులిన్లను సైతం అందించాలి. 72 గంటలు కంటే ఎక్కువ సమయం ఆకలితో ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. లేకపోతే మరణానించే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. మీరు రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉపవాసం ఉన్నా.. నిరాహార దీక్ష చేసినా.. తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. 


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి