Kangana Ranaut: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'

ABP Desam   |  Murali Krishna   |  12 Nov 2021 03:28 PM (IST)

కంగనా రనౌత్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మండిపడ్డారు. ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలన్నారు.

కంగనా రనౌత్‌పై నవాబ్ మాలిక్ ఫైర్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వాతంత్య్రంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కంగనా వ్యాఖ్యలపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్రంగా ఖండించారు. కంగనాకు మలానా క్రీమ్‌ (డ్రగ్స్‌) మత్తు బాగా తలకెక్కినట్టు కనిపిస్తోందంటూ ఆయన మండిపడ్డారు.

2014లోనే భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిందన్న కంగనా వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఆమె స్వాతంత్య్ర సమరయోధులను అవమానపరిచింది. కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తక్షణం వెనక్కి తీసుకోవాలి. ఆమెను అరెస్టు చేయాలి.                                                       - నవాబ్ మాలిక్  మహారాష్ట్ర మంత్రి

ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న కంగనా రనౌత్‌ అనంతరం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు 1947లో లభించింది భిక్ష అనీ, 2014 (మోదీ అధికారం చేపట్టిన అనంతరం ) స్వాతంత్య్రం వచ్చిందని, అలాంటి దాన్ని ఆజాదీగా పరిగణిస్తామా అంటూ వ్యాఖ్యానించింది.

తీవ్ర దుమారం..

భాజపా ఎంపీ వరుణ్ గాంధీ కూడా కంగనాపై విరుచుకుపడ్డారు. దేశం కోసం త్యాగాలు చేసిన వారిని అవమానించడం దారుణం అని మండిపడ్డారు. ఇది పిచ్చా లేక దేశద్రోహమా అంటూ  సోషల్‌ మీడియాలో ప్రశ్నించారు.

 నిన్న మొన్నటిదాకా జాతిపిత మ‌హాత్మాగాంధీ త్యాగాల‌ను అవ‌మానించడమే  కాకుండా,  గాంధీజీని హత్యచేసిన గాడ్సేను పొగిడారు. ఇపుడు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు మంగ‌ళ్ పాండే, రాణి ల‌క్ష్మీభాయి, భ‌గ‌త్ సింగ్, చంద్రశేఖర్‌ ఆజాద్, నేతాజీ సుభాష్  చంద్రబోస్‌ లాంటి లక్షలాది మంది వీరులను అగౌర‌వ పర్చారని వరుణ్‌ గాంధీ మండిపడ్డారు. 

కంగనా మాటలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రాజకీయంగా తమకు ఇష్టమైన వారిని పొగుడుకోవచ్చు కానీ ఇలా దేశానికి స్వాతంత్ర్యం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహనీయుల్ని  కించ పరచడం సరి కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కంగనాపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. 

Also read: Srinagar Encounter: కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

Also read: Corona Cases: దేశంలో కొత్తగా 12,516 కరోనా కేసులు, 501 మరణాలు

Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి

Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?

Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి             

Published at: 12 Nov 2021 03:28 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.