దేశంలో కరోనా కేసులు క్రమంగా 15 వేల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా 12,516 కేసులు నమోదుకాగా 501 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,37,416కు పెరిగింది. గత 267 రోజుల్లో ఇదే అత్యల్పం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 3,44,14,186
- మొత్తం మరణాలు: 4,62,690
- యాక్టివ్ కేసులు: 1,37,416
- మొత్తం రికవరీలు: 3,38,14,080
గత 35 రోజులుగా రోజువారి కరోనా కేసులు 20 వేల కంటే తక్కువే నమోదవుతున్నాయి. గత 138 రోజులుగా 50 వేల కంటే తక్కువే వస్తున్నాయి.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.40గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. కరోనా రికవరీ రేటు 98.26 శాతంగా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.
దేశంలో కొవిడ్ టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 53,81,889 డోసుల వ్యాక్సిన్ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,10,79,51,225కు చేరింది.
కేరళ..
కేరళలో కొత్తగా 7,224 కేసులు నమోదుకాగా 419 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 50,42,082కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 35,040కి పెరిగింది.
మొత్తం రికవరీల సంఖ్య 49,36,791కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 69,625కు చేరింది.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 997 కేసులు నమోదుకాగా 28 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 66,21,420కి పెరిగింది. మరణాల సంఖ్య 1,40,475కు చేరింది.
Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి
Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?
Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి