డబ్బుల కోసం స్నేహితుడిని హతమార్చిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ప్రాణ స్నేహితుడ్నే డబ్బుల కోసం హతమార్చడం స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు వలస కూలీల మధ్య గొడవ చివరికి హత్య చేసే వరకూ దారి తీసింది. మద్యం మత్తులో రూ.2 వేల కోసం ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి స్నేహితుడనే కనికరం లేకుండా దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘోర సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దీంతో స్థానికంగా జనం బెంబేలెత్తిపోయారు.
రూ.2 వేల కోసం స్నేహితుడిని చంపిన ఘటన ముషీరాబాద్‌లోని ఫకిర్ వాడలో గురువారం రాత్రి జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం పోలీసులు విలేకరులకు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన సోను అనే 27 ఏళ్ల వ్యక్తి బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి పని చేసుకుంటున్నాడు. ఇతను వడ్రంగి పని చేసుకుంటూ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, ఇతనికి ముషీరాబాద్ మటన్ షాపులో పనిచేసే అల్తాఫ్ ఖాన్‌తో కొన్నాళ్ల క్రితమే పరిచయం ఏర్పడింది.
Also Read: విగ్గు ధరించి వ్యక్తి అరాచకం, జోరుగా సహజీవనం.. అందినకాడికి దండుకొని చివరికి..
సోను, అల్తాఫ్ ఖాన్ ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ఈ క్రమంలో అల్తాఫ్ ఖాన్ మూడు నెలల క్రితం సోనుకు రూ.2 వేలు అప్పు ఇచ్చాడు. ఎప్పటిలాగే ఇద్దరూ కలిసి గురువారం రాత్రి ముందు తాగేందు కోసం సిట్టింగ్ వేశారు. ఈ క్రమంలో అల్తాఫ్ ఖాన్ గతంలో తాను ఇచ్చిన అప్పు రూ.2 వేలను అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాదన చోటు చేసుకుంది. ఈ వాదన కాస్త గొడవకు దారి తీసింది.
Also Read: విరాట్ కోహ్లీ కూతుర్ని అంత మాట అనేస్తాడా!! సంగారెడ్డి వ్యక్తి అరెస్టు
అనంతరం అల్తాఫ్ ఖాన్ అక్కడి నుంచి మటన్ దుకాణానికి వెళ్లి తన షాపులో కత్తి తీసుకొచ్చి సోనుపై ఆవేశంతో దాడి చేశాడు. గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లుగా చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత అల్తాఫ్ ఖాన్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిపారు. సమచారం అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సోను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
Also Read: పంచ్ ప్రభాకర్ కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?
Also Read: పేకాట బిజినెస్‌లో నాగశౌర్య తండ్రి కూడా పార్టనరే..! అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిలిచ్చిన కోర్టు !