విరాట్ కోహ్లీ, ఆయన కుమార్తెపై అసభ్యకర ట్వీట్లు, బెదిరింపులు చేసినందుకు గానూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్టయ్యాడు. ఇతను భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లి కుమార్తెపై అత్యాచారం చేస్తానంటూ ట్విటర్‌లో బెదిరించాడు. దీంతో యువకుడిని ముంబయి పోలీసులు సంగారెడ్డి జిల్లాలో అరెస్టు చేశారు. నిందితుడు 23 ఏళ్ల రామ్‌ నగేష్‌ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇతను హైదరాబాద్‌‌లోని ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొంతకాలం ఓ ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌‌కు చెందిన సంస్థలో ఉన్నత స్థానంలో పనిచేసినట్లు గుర్తించారు. 


అయితే, ఇటీవల గత నెల 24న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం పాలైన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు గెలవలేకపోయింది. దీంతో దేశమంతా క్రికెట్ అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది. దీనిపై అభిమానులు తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. అయితే, మరికొంత మంది తిడుతూ ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మరీ ఘోరంగా స్పందించాడు. ‘క్రిక్‌ క్రేజీ గర్ల్‌’ పేరుతో ఉన్న ఆ ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా ఓ వ్యక్తి అసభ్యకర, అభ్యంతరక ట్వీట్ చేశాడు. 


విరాట్‌ కోహ్లిని బెదిరిస్తూ ఈ ట్వీట్‌ వచ్చింది. క్షణాల్లో అది వైరల్‌గా మారిపోయింది. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను ట్విటర్‌ తొలగించింది. భారత్‌ - పాకిస్థాన్ జట్ల మధ్య ఆట ముగిసిన కొద్దిసేపటికే విరాట్‌ కోహ్లి కుమార్తెపై అత్యాచార బెదిరింపుల ట్వీట్‌ రావడంతో దానిపై దేశవ్యాప్తంగా వెల్లువలా విమర్శలు వచ్చాయి. ఇలాంటి భావం ఉన్న ఆ ట్వీట్ చేసిన వ్యక్తిని ఉరి తీయాలని కూడా చాలా మంది ట్వీట్లు చేశారు.


Also Read: Hyderabad Crime: విగ్గు ధరించి వ్యక్తి అరాచకం, జోరుగా సహజీవనం.. అందినకాడికి దండుకొని చివరికి..


ఈ బెదిరింపుల ట్వీట్‌పై స్పందించిన విరాట్ కోహ్లీ వ్యక్తిగత మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు, ముంబయి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. దానిపై దర్యాప్తు చేపట్టి రంగంలోకి దిగారు. విచారణలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన రామ్‌ నగేష్‌ అనే వ్యక్తి ఈ ట్వీట్‌ చేశాడని ఆధారాలు సేకరించారు. అతని ఆచూకీ కూడా కనుగొన్నారు.


Also Read : బట్టలిప్పేసి నగ్నంగా పక్కింటికి వెళ్లిన యువకుడు.. ఏం చేశాడంటే..!


ఈ క్రమంలో బుధవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారంలోని ఆయుధ కర్మాగారం (ఓడీఎఫ్‌)లో అతడు ఉంటున్న ప్రాంతానికి చేరుకుని రామ్ నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రామ్‌ నగేష్‌ తండ్రి ఓడీఎఫ్‌లో ఉద్యోగి. నిందితుడి అరెస్టు అనంతరం ఆయన తల్లిదండ్రులు కూడా తాము ఉంటున్న క్వార్టర్‌కు తాళం వేసి వెళ్లిపోయారు.


Also Read: క్షమాభిక్ష లేదని కోర్టు చెప్పేసింది.. కొన్ని గంటల్లోనే ఉరి శిక్ష.. అప్పుడే ఊహించని ట్విస్ట్


Also Read: పేకాట బిజినెస్‌లో నాగశౌర్య తండ్రి కూడా పార్టనరే..! అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిలిచ్చిన కోర్టు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి