ఏదైనా ప్రమాదం నుంచి.. బయటపడినప్పుడు మనం తరచూ వినే పదం భూమి మీద నూకలు మిగిలే ఉన్నాయని. ఇప్పుడు అలాంటి ఘటనే ఓ వ్యక్తి కేసులో జరిగింది. కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇక రేపు ఉరి అనకునే టైమ్ లోనే.. మరో విషయం తెలిసింది. అతడికి తాత్కాలికంగా ఉరి నిలిపి వేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఏంటి అతడి కేసు? అతడి కథలో ఏమైంది.
భారత సంతతి మలేషియన్ నాగేంద్రన్ ధర్మలింగం. సింగపూర్ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. సింగపూర్‌కు 42గ్రాముల హెరాయిన్ సరఫరా చేశారని నాగేంద్రన్‌పై 2009లో అభియోగాలు నమోదయ్యాయి. తర్వాత అవి నిరూపణ కూడా అయ్యాయి. 2010లో అతడికి మరణశిక్ష విధించారు. తర్వాత ఉన్నత న్యాయస్థానాల్లో పలుసార్లు అప్పీళ్లు చేసుకున్నా.. ఫలితం లేదు. అధ్యక్షుడి క్షమాభిక్ష కోరినా కూడా నిరాశే ఎదురైంది.
బుధవారం రోజున అంటే నవంబర్ 10న ఛాంగీ జైల్లో ధర్మలింగానికి ఉరిశిక్ష విధించాలని.. కోర్టు ఆదేశించింది. అయితే అప్పటికే తన మానసిక స్థితి బాగాలేదని.. మరణశిక్ష నిలిపివేయాలని కోర్టులో ధర్మలింగం పిటిషన్ ధాఖలు చేశాడు. అయితే అతడి పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చంది. అప్పీలుకు వెళ్లేందుకు ఒకరోజు అనుమతినిచ్చింది. దీనిపై అతడు పై కోర్టుకు వెళ్లాడు. నాగేంద్రన్ ఉరిశిక్ష విషయంపై కోర్టు విచారణ చేపట్టింది. ఇలాంటి సమయంలోనే నాగేంద్రన్ కు కొవిడ్ సోకినట్లు హైకోర్టు న్యాయమూర్తులకు జైలు అధికారులు చెప్పారు. బుధవారం నాటి ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
ఉరి శిక్ష దగ్గరపడే టైమ్ లో ఇలాంటి ఘటన ఊహించని పరిణామమం అని కోర్టు అభిప్రాయపడింది. ముద్దాయికి కరోనా సోకింది కాబట్టి.. మానవత్వం చూపించాల్సిన అవసరం ఉందని.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆండ్రూ ఫాంగ్ అన్నారు. కేసు విచారణను వాయిదా వేశారు. అయితే కొన్ని గంటల్లో ఉరికంభం ఎక్కుతాడు అనుకున్న వ్యక్తి జీవితంలో ఇలాంటి ట్విస్టు రావడంతో ఈ కేసుపై అంతర్జాతీయంగా ఆసత్తి పెరిగింది. మరో విషయం ఏంటంటే.. నాగేంద్రన్ మరణ శిక్షను వ్యతిరేకిస్తూ.. చాలా మంది సంతకాల సేకరణ చేశారు. మానవహక్కుల సంఘాలు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నాయి. నాగేంద్రన్ ఉరిశిక్ష అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్శించింది. మలేషియా ప్రధానికి కూడా సింగపూర్ కు ప్రభుత్వానికి లేఖ రాశారు.
Also Read: TikTok: 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కాపాడిన్ టిక్ టాక్.. ఎలా అంటే..?
Also Read: Naked Man In Theater: మూవీ థియేటర్ గోడలో నగ్నంగా వ్యక్తి.. కొన్ని రోజులుగా అందులోనే.. ఎలా దూరావయ్య?