ఎలా దూరాడో ఏమో.. ఓ వ్యక్తి సినిమా థియేటర్‌లోని బాత్‌రూమ్ గోడ లోపల ఇరుక్కున్నాడు. థియేటర్ సిబ్బంది మనిషి కనిపించలేదు. కానీ.. అరుపులు మాత్రం వినిపిస్తున్నాయి. దీంతో వారు మొదట దెయ్యం అనుకున్నారు. కానీ, అతడి ఆర్తనాదాలు విని.. ఎక్కడున్నావ్ అని అడిగారు. తాను బాత్‌రూమ్ గోడలో చిక్కుకున్నానని బాధితుడు తెలపడంతో వెంటనే 911కు కాల్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. అసలు ఏం జరిగిందంటే..
న్యూయార్క్‌లోని ఓ థియేటర్ నుంచి 911కు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో తమ థియేటర్ బాత్‌రూమ్‌లో ఇరుక్కున్నాడని ఫోన్లో చెప్పారు. దీంతో పోలీసులు వెంటనే సైరాకస్ ఫైర్ డిపార్ట్మెంట్‌కు ఉదయం 7.32 గంటలకు సమాచారం అందించారు. 326 సౌత్ సలీనా స్ట్రీట్‌లోని ఓ ప్రముఖ థియేటర్ బాత్‌రూమ్ గోడలో ఇరుక్కున్న వ్యక్తిని రక్షించాలని చెప్పారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
చిత్రం ఏమిటంటే ఆ వ్యక్తి గోడ లోపల ఇరుక్కున్నాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది కొద్ది కొద్దిగా గోడను తొలుచుతూ బాధితుడిని బయటకు తీశారు. అయితే, అతడు సుమారు రెండు, మూడు రోజులుగా ఆ గోడలోనే ఉన్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆకలి, దప్పికలతో బాగా నీరసించిపోయాడు. మరో చిత్రం ఏమిటంటే.. అతడి శరీరంపై నూలు పోగు కూడా లేదు. ఇంతకీ ఆ వ్యక్తి ఆ గోడలో ఎలా చిక్కుకున్నాడు? నగ్నంగా ఎందుకు ఉన్నాడు? అనే సందేహాలు నెలకొన్నాయి. దీనిపై పోలీసులు ఎలాంటి సమాచారాన్ని మీడియాకు ఇవ్వలేదు. ప్రస్తుతం బాధితుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
Also Read: చల్లటి నీరు లేదా కూల్ డ్రింక్, కాఫీలతో మాత్రలు వేసుకోవచ్చా?
ఆ థియేటర్ గురించి తెలిసిన పలువురు నెటిజనులు.. అందులో ఆత్మలు సంచరిస్తుంటాయని, బహుశా అతడు వాటిని కనుగోవడం గురించి వచ్చి అలా గోడలో ఇరుక్కుపోయాడేమో అని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం.. థియేటర్‌లోని కాపర్‌ను దొంగిలించడానికి వచ్చి అలా బుక్కైపోయాడేమో అని అనుకుంటున్నారు. కొందరైతే.. అతడు నగ్నంగా ఉన్నాడు కాబట్టి.. తప్పకుండా టైం మిషిన్ నుంచి వచ్చి ఉంటాడని అంటున్నారు. ఇలా నెటిజనులు తమకు తోచిన విధంగా అతడి గురించి చర్చిస్తున్నారు. అసలు నిజం ఏమిటనేది బాధితుడు చెబితేనే తెలుస్తుంది. అప్పటి వరకు అతడు గోడ లోపలికి ఎలా వెళ్లాడనేది మాత్రం మిస్టరీనే.
Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!