అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ అలియాస్ చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ ఇంటర్ పోల్ సాయంతో బ్లూకార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసు వల్ల పంచ్ ప్రభాకర్ ఎక్కడ ఉన్నాడో సీబీఐకి స్పష్టమైన సమాచారం వస్తుంది. ఈ సమాచారం ఆధారంగా అతను ఇండియాలో నేరం చేశాడని అతనిని అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని కోరే అవకాశం ఉంది. ఒక వేళ అలా అప్పగించడానికి అవకాశం లేకపోతే అతనిని అమెరికా నుంచి స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకునే చాన్సులు ఉన్నాయి. అతను స్వదేశానికి వస్తే సీబీఐ అధికారులు ఇక్కడ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 


Also Read : విగ్గు ధరించి వ్యక్తి అరాచకం, జోరుగా సహజీవనం.. అందినకాడికి దండుకొని చివరికి..


అమెరికాలో పశువైద్యునిగా పని చేస్తున్న చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి యూట్యూబ్‌లో పంచ్ ప్రభాకర్ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. అందులో  లైవ్‌లో మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను కించ పరిచేలా మాట్లాడారని.. ఓ పెద్ద కుట్రతోనే ఇలా చేశారని ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే విదేశాలలో ఉన్న కారణంగా అరెస్ట్ చేయలేకపోయారు. కేసు నమోదైన తరవాత కూడా పంచ్ ప్రభాకర్ న్యాయవ్యవస్థపై తీవ్ర ఆరోపణలు, దూషణలు కొనసాగిస్తున్నారు. దీంతో హైకోర్టు సీబీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 


Also Read : బట్టలిప్పేసి నగ్నంగా పక్కింటికి వెళ్లిన యువకుడు.. ఏం చేశాడంటే..!


ఈ నెల రెండో తేదీన జరిగిన విచారణలో పది రోజుల్లోగా అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. పది రోజుల గడువు ముగుస్తున్న సమయంలో న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన మరో ఐదు మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది కానీ.. పంచ్ ప్రభాకర్‌ను మాత్రం అరెస్ట్ చేయలేకపోయింది. పంచ్ ప్రభాకర్‌తో పాటు మరో వ్యక్తి కోసం ఈ  బ్లూకార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకూ న్యాయవ్యవస్థపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన కేసుల్లో పదకొండు మందిపై చార్జిషీట్లు దాఖలు చేశారు.


Also Read: పేకాట బిజినెస్‌లో నాగశౌర్య తండ్రి కూడా పార్టనరే..! అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిలిచ్చిన కోర్టు !


సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టడం.. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడంతో పాటు వ్యవస్థల్ని కూడా భయపెట్టి తీర్పుల్ని ప్రభావితం చేసేందుకు ఓ భారీ కుట్ర జరిగిందని సీబీఐ అనుమానిస్తోంది. న్యాయవ్యవస్థపై ప్రణాళికాబద్దంగా జరిగిన బెదిరిపులు, దుష్ఫ్రచారం మొత్తం వెనుక కుట్ర ఉందని సీబీఐ, హైకోర్టు నమ్ముతున్నాయి. ఈ కుట్రను ఛేదించడానికి సీబీై దర్యాప్తు చేస్తోంది. 


Also Read: క్షమాభిక్ష లేదని కోర్టు చెప్పేసింది.. కొన్ని గంటల్లోనే ఉరి శిక్ష.. అప్పుడే ఊహించని ట్విస్ట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి