ఒక్కసారి వచ్చిందా జీవితాంతం వెంటాడే ఆరోగ్య సమస్య మధుమేహం. ఏటా పదిలక్షలమందిని బలితీసుకుంటున్న మహమ్మారి ఇది. రక్తంలోకి వచ్చే గ్లూకోజ్ ను శక్తిగా మార్చే ప్రక్రియ సక్రమంగా జరగనప్పుడు డయాబెటిస్ వస్తుంది. ఇది రావడమే కాదు గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, అంధత్వం, పాదాలు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చి వాటిని తొలగించే పరిస్థితికి తీసుకురావడం వంటి సమస్యలకు కూడా దారితీసేలా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల మంది ప్రజలు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ప్రతి ఏటా ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 


డయాబెటిస్ రోగం ఉన్న వారు ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే పరిస్థితి అకస్మాత్తుగా తలకిందులు అవుతుంది. వారు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా కింద చెప్పిన మూడు పదార్థాలు రోజూ తీసుకుంటే షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇతర ఆరోగ్యసమస్యలు రాకుండా కాపాడతాయి. 


కాకరకాయ రసం
మధుమేహం ఉన్న వారు రోజూ కాకరకాయను కూరగానో, పులుసుగానో తినడం అలవాటు చేసుకోవాలి. లేదా ఉదయాన లేచిన వెంటనే 30 ఎమ్ఎల్ కాకరకాయ జ్యూస్ తాగాలి. రోజూ ఇలా కాకరకాయ జ్యూస్ తాగితే షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు. ఇందులో చారన్టిన్, పాలీపెప్టైడ్2 అనే ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి చక్కెరస్థాయిని నియంత్రించేందుకు సహకరిస్తాయి. అలాగే గుండెపోటు వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.


మెంతులు
షుగర్ వ్యాధిగ్రస్తులు మెంతులు కూడా ఎంతో మేలు చేస్తాయి. మెంతులను పొడి చేసి ఒక డబ్బాలో దాచుకోండి. గ్లాసు నీటిలో స్పూను పొడి కలుపుకుని తాగితే చాలా మంచిది. లేదా రాత్రి మెంత్రుల్ని నీటి నానబెట్టి ఉదయానే ఆ నీటిని తాగినా మంచిదే. షుగర్ లెవెల్స్ ను పెరగకుండా చూడడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. మెంతాకులతో కూర, పప్పు వండుకుని తినడం తరచూ చేస్తుండాలి. 


ఉసిరి రసం
పచ్చి ఉసిరి కాయలు తిన్నా, ఉసిరి రసం రోజూ తాగినా డయాబెటిక్ రోగులకు చాలా మంచిది. పరగడుపునే 30 ఎమ్ఎల్ ఉసిరి రసం తాగడం అలవాటు చేసుకుంటే మధుమేహం వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులేవీ మీ జోలికి రావు. ఉసిరి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఏవైనా దెబ్బలు తాకినా త్వరగా తగ్గిపోయేందుకు కావాల్సిన శక్తిని ఉసిరి రసం అందిస్తుంది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: ఉల్లిపాయ అధికంగా తింటే మేలే కాదు, కీడు కూడా చేస్తుంది


Also read: చలికాలంలో వేడి పుట్టించే నువ్వులు తినడం అవసరమే


Also read: ఈ అలవాట్లు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి