బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఎక్కువగా చెన్నైపై కనపడుతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారి, సాయంత్రానికి వాయుగుండంగా మారింది. దీంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తడలో 7.5 సెంటీమీటర్లు, వాకాడులో 6, నాయుడుపేటలో 5.4 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. ఇక గురువారం కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. 


బుధవారం రాత్రి 9 గంటలకు చెన్నైకి 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 420 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈరోజు సాయంత్రం శ్రీహరికోట-కరైకల్ మధ్య కడలూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరం దాటే వరకు తమిళనాడుతోపాటు దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


ఈరోజు నెల్లూరు, ప్రకాశంతోపాటు, చిత్తూరు, కడప జిల్లాల్లో కూడా సాధారణం నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు, కృష్ణా నుంచి విశాఖ వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. 


Also Read: పేకాట బిజినెస్‌లో నాగశౌర్య తండ్రి కూడా పార్టనరే..! అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిలిచ్చిన కోర్టు !


ఈ నెల 13న మరో ముప్పు.. 
వాయుగుండం తీరం దాటినా ఈనెల 13న దక్షిణ అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈనెల 15 నాటికి అది బలపడుతుందని తెలిపింది.


Also Read : బట్టలిప్పేసి నగ్నంగా పక్కింటికి వెళ్లిన యువకుడు.. ఏం చేశాడంటే..!


అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. 
వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా ప్రాంతంలో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. ఓవైపు స్థానిక ఎన్నికల హడావిడి ఉండగా.. మరోవైపు వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంకం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.


Also Read: హైదరాబాద్ లో దారుణం.. యువతిని 18 సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది


Also Read: క్షమాభిక్ష లేదని కోర్టు చెప్పేసింది.. కొన్ని గంటల్లోనే ఉరి శిక్ష.. అప్పుడే ఊహించని ట్విస్ట్


Also Read: పేరు విలియమ్స్ .. చేయాల్సింది పియానో వాయించడం.. చేసింది అమ్మాయిలకు టోకరా ! ఈ మోసగాడి కథ మామూలుగా లేదు.. !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి