Breaking News Live: హైదరాబాద్ లో దారుణం.. యువతిని 18 సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది
ఏపీ, తెలంగాణ సహా అంతర్జాతీయంగా నేడు జరిగే బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. యువతిని ఓ ప్రమోన్మాది కత్తితో పొడిచాడు. ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శిరీష అనే యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితోదాడి చేశడు. శిరీష పరిస్థితి విషమం నవీన హాస్పిటల్ కి తరలించారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించి పెళ్లికి నిరాకరించిందని యువతిపై బస్వరాజ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్టు తెలిసింది.
శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పి 3 గనిలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. 21 డిప్ 24 లెవల్ వద్ద రూఫ్ ఫాల్ అవడంతో ఇద్దరు కార్మికులు మృతి. 3, 21 క్రాస్ సమీపంలో ప్రమాదం జరగడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, గని వద్ద ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లచ్చయ్య, చంద్రశేఖర్ మరణించినట్లు సమాచారం. మొదటి షిఫ్టు లోభాగంగా మైన్ లో బొగ్గు వెలికి తీస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ వాహనం అడ్డుకొనెందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత. బీజేపీ నాయకులను వెనక్కి నెట్టుకుంటూ పోయిన వైసీపీ నేత గోపికృష్ణ. సీఎం జగన్ కు వ్యతిరేకంగా బీజేపీ నాయకుల నినాదాలు.. సీఎం,ఎమ్మెల్సీలకు అనుకూలంగా గోపికృష్ణ, వైసీపీ నాయకులు నినాదాలు చేశారు. బీజేవైఎం నేతలు ర్యాలీగా వెళ్తూ ఎమ్మెల్సీ వాహనం అడ్డుకునేందుకు యత్నించారు.
ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు. ఈటల గెలుపుతో పార్టీలకతీతంగా ఉద్యకారులంతా సంబుర పడ్తున్నారు. ఉద్యమకారుడికి మద్దతుగా నేను కూడా వచ్చానంటూ గన్ పార్క్ వద్ద మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.
ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేయడంపై నేడు రెండో రోజు బంద్ కొనసాగుతోంది. ఎయిడెడ్ కళాశాలగానే కొనసాగించాలని అనంతపురంలోని ఎస్ ఎస్ బి ఎన్ కాలేజీ వద్ద విద్యార్థుల ధర్నాకు దిగారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. తాము కూడా అదే యాజమాన్యానికి వినతిపత్రం ఇవ్వాలని భావిస్తున్నామని, అంతేకానీ ధర్నా చేయకూడదని విద్యార్థులకు పోలీసులు సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. మిల్లర్లు ధాన్యం తూకంలో కోత విధిస్తున్నారని జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రోడ్డుపై రైతులు బైఠాయించారు. 300 క్వింటాళ్ల లోడుకు 8 క్వింటాళ్ల కోత విధిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. రైతుల బైఠాయింపుతో ట్రాఫిక్ జామ్ కావడంతో అన్నదాతలను సముదాయించే పనిలో పడ్డారు పోలీసులు.
ఉన్నతాధికారులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందుకొని ప్రజలకు స్ఫూర్తి నింపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తన భార్యను ప్రసవం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆమె ఈ రోజు పండంటి బాబుకు జన్మనించింది. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్లు రామకృష్ణ భార్గవి నేతృత్వంలో ఆస్పత్రి వైద్య బృందం శ్రీకాంతి, డా.దేవిక, కల్యాణి, రాజ్యాలక్ష్మి సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీశారు.
Background
హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేస్తారు. తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈటల రాజేందర్ 7వ సారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడతారు. జూన్ 12 న ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆస్పత్రిలో యువతి ఆత్మహత్య
ఆరోగ్య సమస్య కోసం ఆసుపత్రికి వెళ్లిన యువతి అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. మరో నాలుగైదు గంటల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా ఉరేసుకుంది. రాజేంద్రనగర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు నెల్లూరు నగరానికి చెందిన సుదీప్తి అనే 27 ఏళ్ల యువతి.. బండ్లగూడజాగీర్‌లోని అపార్ట్‌మెంట్లో ఉంటోంది. ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. ఈ నెల 6న అనారోగ్యంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. మూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ పూర్తిగా కోలుకుంది. మంగళవారం మధ్యాహ్నం డిశ్ఛార్జి కావాల్సి ఉండగా.. ఉదయం 9 గంటల సమయంలో ఆమె గదిలోకి నర్సు వెళ్లగా లోపలి నుంచి తలుపు లాక్ చేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్లి చూడగా.. సుదీప్తి ఫ్యానుకు ఉరి వేసుకొని ఉంది. దీంతో ఆసుపత్రి నిర్వహకులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు.
Also Read : అర్ధనగ్న స్థితిలో మహిళా డాన్సర్ మృతి.. పక్కనే బీరు బాటిల్
22వ రోజుకు షర్మిల ప్రజా ప్రస్థానయాత్ర
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మంగళవారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లిలో ఆమె పాదయాత్ర చేశారు. నేడు నకిరేకల్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు నార్కట్ పల్లి మండలం కొడపాక గూడెం నుంచి షర్మిల పాదయాత్ర మొదలవుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు నెమ్మాని గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల పాల్గొంటారు.
Also Read: Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
- - - - - - - - - Advertisement - - - - - - - - -