నల్లగొండలో ఓ మహిళ తన భర్త తనను మోసం చేస్తున్నాడని.. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఆ మహిళ తన భర్త తనను మాత్రమే కాదని ఇతర యువతుల్ని కూడా మోసం చేస్తున్నాడని.. వాళ్లను.. తన భర్త నుంచి కాపాడాలని కోరింది. ఈ కేసు కాస్త విచిత్రంగా ఉండటంతో పోలీసులు నెమ్మదిగా కూపీ లాగారు. ఎంత లాగినా ఆ మోసాల చిట్టా వస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఆ భర్త .. ఆ భార్యను కాకుండా 19 మంది యువతుల్ని పెళ్లి పేరుతో మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంకా ఎవరైనా వస్తే ఈ జాబితా పెరుగుతుంది. ఇంత మందిని అతను ఎలా మోసం చేశాడా అని పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
Also Read : సుబ్బరామిరెడ్డి కంపెనీకి భారీ టోకరా.. నిందితులు అరెస్టు, అసలేం జరిగిందంటే..
19 మంది యువతుల్ని పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తి పేరు విలియమ్సన్. న్యూజిలాండో.. ఆస్ట్రేలియాకో చెందిన వ్యక్తి కాదు.. అచ్చంగా నల్లగొండ వ్యక్తే. కాకపోతే చర్చిలో పని చేస్తాడు. అందుకే ఆ పేరు పెట్టుకున్నాడు. చర్చిలో చేసే పని పియానో వాయించడం. చర్చికి ప్రార్థనల కోసం జనం వచ్చినప్పుడు.. వాళ్లంతా ప్రార్థనలు చేస్తున్న సమయంలో పియానో వాయిస్తూ ఉంటాడు. అతను పియానో వాయించడం చాలా మందికి నచ్చి వచ్చి మాటలు కలిపేవారు. అదే చాన్స్ అనుకున్నాడు విలియమ్సన్. తమ మాయ మాటలను నమ్మిన వారందర్నీ వంచించడం ప్రారంభించాడు.
Also Read : అర్ధనగ్న స్థితిలో మహిళా డాన్సర్ మృతి.. పక్కనే బీరు బాటిల్
పెళ్లి కాలేదని చెప్పి చర్చికి వచ్చే అమ్మాయిల్లో తన బుట్టలో పడిన వారందర్నీ మోసం చేయడం ప్రారంభించాడు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఆ పందొమ్మిది మంది యువతులకు డౌట్ రాలేదేమో కానీ.. విలియమ్సన్ భార్యకు మాత్రం డౌట్ వచ్చింది. కొన్ని వివరాలు కనుక్కుంది. చాలా మంది యువతులు మోసపోతున్నారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విలియమ్సన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
తన భార్య ఫిర్యాదు చేసిన తన గుట్టు అంతా బయట పెట్టించేసిందని తెలియడంతో విలియమ్సన్ ఆందోళనకు గురయ్యాడు. తనకు గుండెపోటు వచ్చిందో లేక వచ్చినట్లు అనిపించిందో.. లేకపోతే.. నిజం తెలిసి ఆ పందొమ్మిది మంది అమ్మాయిలు వచ్చి కొట్టే కొట్టుడుకు నిజంగానే వస్తుందని ఫీలయ్యాడో కానీ వెళ్లి ఆస్పత్రిలోచేరిపోయాడు. అతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పోలీసులు పట్టుకెళ్లి తమదైన పియానో వాయింపు రుచి చూపించే అవకాశం ఉంది.
Also Read: Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులు