హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA)లో సోమవారం భారీగా విదేశీ కరెన్సీ పట్టుపడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్‌ వెళ్తోన్న ఓ ప్రయాణికుడి వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. సయ్యద్ ఖలీద్ అనే ప్రయాణికుడు వద్ద సుమారు రూ.12,86,000 విలువైన సౌదీ కరెన్సీ రియాల్స్‌ను సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించింది. సీఐఎస్‌ఎఫ్... కరెన్సీని స్వాధీనం చేసుకుని, విచారణ కోసం ఖలీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 






Also Read: పంజాగుట్ట బాలిక మిస్టరీ కేసులో స్పష్టత, చనిపోయింది అందుకే.. కానీ,


13 లక్షల విలువ చేసే సౌదీ కరెన్సీ పట్టివేత 


శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్తోన్న ఓ ప్రయాణికుడి వద్ద సుమారు 13 లక్షల‌ విలువ(65 వేల రియాల్స్) చేసే సౌదీ రియాల్స్ సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రయాణికులు విదేశీ కరెన్సీ తరలిస్తున్నాడు. బట్టలలో చుట్టి హ్యాండ్ బ్యాగ్ లో విదేశీ కరెన్సీని దాచాడు. ఎయిర్‌పోర్ట్ లో భద్రతా సిబ్బంది స్క్రీనింగ్ లో విదేశీ కరెన్సీ పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా శంషాబాద్ విమానాశ్రంలో బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడుతూనే ఉంది. స్మగ్లర్లు కొత్త మార్గాల్లో బంగారం, నగదు తరలిస్తున్నారు. 


Also Read: ఎన్నోసార్లు మెడలు నరుక్కుంట అన్నవ్.. మా మెడలు ఇరుస్తవా? కేసీఆర్‌పై విజయశాంతి సంచలనం


ఇటీవల ఓ ఘటన


ఇటీవల ఇటువంటి ఘటన జరిగింది. హైదరాబాద్​శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సౌదీ కరెన్సీ సీజ్ చేశారు. ఓ ప్రయాణికురాలి వద్ద రూ.10 లక్షల విలువైన సౌదీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికురాలు అలియాభాను వద్ద విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆమెను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు.  


Also Read: కన్నతల్లి ఇంట్లోనే కూతురు దొంగతనం.. గంటల్లోనే అడ్డంగా దొరికిపోయింది ఇలా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి