కరోనా వైరస్ ను తొలిరోజుల్లో సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలలో భారత్ ఒకటి. కానీ పూర్తి స్థాయిలో కొవిడ్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. నేటికీ కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 10,126 కొత్త కేసులను గుర్తించారు. క్రితం రోజుతో పోల్చితే కరోనా కేసులు తగ్గాయి.


నిన్న ఒక్కరోజులో 332 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజుతో పోల్చితే కొవిడ్ మరణాలు సైతం భారీగా పెరిగాయి. దేశంలో ఇప్పటివరకూ 4,61,389 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం 1,40,638 (ఒక లక్షా 40 వేల 638) యాక్టివ్ కేసులున్నాయి. కాగా, గత 263 రోజులలో ఇవే అతి తక్కువ క్రియాశీల కేసులు. మరోవైపు నిన్న ఒక్కరోజులో 11,982 మంది కరోనా మహమ్మారిని జయించారు. దాంతో కొవిడ్19 రికవరీ రేటు 98.25 శాతానికి చేరింది. మొత్తం కరోనా కేసులలో యాక్టివ్ కేసులు 0.42 శాతం ఉంది.
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..






దేశంలో నిన్న ఒక్కరోజులో 59,08,440 (59 లక్షల 8 వేల 440) డోసుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకూ భారత్‌లో 1,09,08,16,356 (109 కోట్ల 8 లక్షల 16 వేల 356) డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ జరిగింది. దేశంలో నమోదవుతున్న కేసులలో సగం కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా ఇందులో అంతగా ప్రయోజనం కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా నమోదయ్యే కరోనా కేసులు, మరణాలలో అధిక వాటా తమ రాష్ట్రం నుంచే ఉండటం కేరళ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read: మనసు స్థిరంగా లేదా, ఆందోళనగా అనిపిస్తోందా... వీటిని తినండి


ఏపీలో కొత్తగా 246 కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో 246 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,401కి చేరింది.  ఒక్కరోజు వ్యవధిలో 334 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,50,720 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 3,366 యాక్టివ్‌ కేసులున్నాయి.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి