ఆధునిక కాలంలో ఉరుకుల పరుగల జీవితం. శారీరకంగా అలసిపోతాం, కానీ మానసికంగా చితికిపోతాం. రకరకాల మానసిక సమద్యలు మొదలవుతాయి. కనీసం ఆ సమస్యలు మనకి ఉన్నాయని కూడా కనిపెట్టలేం... ఎందుకంటే అవి బయటికి కనిపించవు కదా. మనసు స్థిరంగా లేకపోవడం, ఒత్తిడిగా అనిపించడం, కంగారు, గాభరా ఎక్కువవడం, పొట్టలో నొప్పిగా, భయంగా అనిపించడం ఇవన్నీ మానసిక ఆందోళన ఉందని చెప్పే లక్షణాలు. ఇవేవీ మీ దరిచేరకుండా ఉండాలంటే యాంటీ యాంగ్జయిటీ ఆహారాలను తీసుకోవడం మొదలు పెట్టండి.


బాదం పప్పులు
రోజుకు నాలుగు బాదం పప్పులు ముందు రోజు రాత్రే నీటిలో నానబెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం వాటిని తినడం. వీటిలో విటమిన్ ఇ, మెగ్నీషియం ఉంటాయి. మెదడుకు ఇవి చాలా మేలుచేస్తాయి. విటమిన్ ఇ మెదడు పైపొరలోని కణాలకు రక్షణగా నిలుస్తుంది. జ్ఞాపకశక్తి కూడా తగ్గకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. 


అరటి పండు
రోజుకో అరటి పండు మీ మెదడుకే కాదు, మొత్తం శరీర వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పొటాషియం అరటిపండులో అధికంగా ఉంటుంది. మానసిక ఆందోళనను పెంచే రక్తంలోని చక్కెర స్థాయులను మరింతగా పెరగకుండా అరటి పండులోని గుణాలు అడ్డుకుంటాయి.  మెదడు నాడుల్లో సంకేతాల ప్రసారం, కండరాల పనితీరు సక్రమంగా ఉండేలా చూస్తుంది. 


బ్రౌన్ రైస్
ఇందులో మెదడు ఆరోగ్యానికి అవసరమైన మాంగనీసు, సెలీనియం, మెగ్నీషియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నాడీవ్యవస్థ పనితీరుకే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా వసరం. కాబట్టి మానసిక ఆందోళన బారిన పడిన వాళ్లు తెల్లఅన్నానికి బదులు బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి. 


అవిసె గింజలు
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే ఆహారం ఇది. కానీ వాడుకలో మాత్రం పెద్దగా లేదు.  అవిసె గింజలను పొడి రూపంలోనో, లేక స్నాక్స్ రూపంలో ఏదో రకంగా తినడం అలవాటు చేసుకోవాలి. వీటిలో బి విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, మాంగనీసు, ఐరన్, జింక్ మొదలైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మానసిక ఆందోళనను తగ్గిస్తాయి. గోరువెచ్చని నీళ్లలో అవిసె గింజల పొడిని కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: పాదాలకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి? బంగారపువి ఎందుకు ధరించకూడదు?


Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు


Also read: మీ గురక వల్ల ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడుతున్నారా... ఇలా చేసి చూడండి


Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి