ఒప్పో ఏ16కే స్మార్ట్ ఫోన్ ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయింది. కంపెనీ ఏ-సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఒప్పో ఏ16కు మరో వేరియంట్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


ఒప్పో ఏ16కే ధర
దీని ధరను 6,999 ఫిలిప్పీన్ పెసోలుగా(సుమారు రూ.10,300) నిర్ణయించారు. ఇందులో కేవలం 3 జీబీ ర్యామ్ + 32 స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. బ్లాక్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతానికి ఫిలిప్పీన్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఒప్పో ఏ16 ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. కాబట్టి ఒప్పో ఏ16కే కూడా మనదేశంలో లాంచ్ అయింది.


ఒప్పో ఏ16కే స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.1 లైట్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. గతంలో లాంచ్ అయిన ఒప్పో ఏ16లో మాత్రం వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ బొకే సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి.


డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4230 ఎంఏహెచ్‌గా ఉంది. సూపర్ పవర్ సేవింగ్ మోడ్, నైట్ ఫిల్టర్స్, ఆప్టిమైజ్డ్ నైట్ చార్జింగ్ కూడా ఇందులో ఉంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 175 గ్రాములుగా ఉంది.


Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!


Also Read: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర ఎంత ఉండనుందంటే?


Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి