జుమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో చేరింది. హస్తకళలు, జానపద కళలకు నెలవైన శ్రీనగర్ యునెస్కో గుర్తింపు పొందడంపై జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సృజనాత్మక నగరాల జాబితాలో శ్రీనగర్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో 48 నగరాలను యునెస్కో గుర్తించింది. ఈ ఎలైట్ జాబితాలో అబుదాబి, కేన్స్ నగరాలు కూడా చోటు సంపాదించాయి.
Also Read: ట్యాక్సీ డ్రైవర్.. ఓ బ్యాగ్.. ఇద్దరు మనుషులు.. అంబానీ ఇంటి వద్ద హైఅలర్ట్!
వారసత్వ సంపద అందించడమే లక్ష్యంగా
క్రియేటివ్ సిటీస్ జాబితాను(UCCN) యునెస్కో తన వెబ్ సైట్లో ప్రకటించింది. భారతదేశం నుంచి శ్రీనగర్‌తో పాటు 49 నగరాలను ఈ నెట్‌వర్క్‌లో చేర్చాలని యునెస్కో నిర్ణయించిందని ప్రకటనలో తెలిపింది. సంస్కృతి, సృజనాత్మకపై ఈ నగరాల వాసుల్లో నిబద్ధతను గుర్తించి, భవిష్యత్ తరాలకు వారసత్వ సంపద అందించాలని వారి లక్ష్యాన్ని చాలా ప్రధానమైందని పేర్కొంది. యునెస్కో సైట్‌లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం ఈ నెట్‌వర్క్ ఇప్పుడు 295 నగరాలు చేరాయి. సంస్కృతి, సృజనాత్మకతలో పెట్టుబడి పెట్టే 90 దేశాలకు ఈ వివరాలు అందిస్తామని యునెస్కో తెలిపింది. క్రాఫ్ట్స్, జానపద కళలు, డిజైన్, ఫిల్మ్, గ్యాస్ట్రోనమీ, సాహిత్యం, మీడియా కళలు, సంగీతం రంగాల్లో పెట్టుబడి పెడుతూ సుస్థిర అభివృద్ధి సాధించేందుకు తోడ్పడుతుందని పేర్కొంది.
Also Read: జైకోవ్-డీ టీకాకు కుదిరిన రేటు.. ఇక వ్యాక్సినేషనే లేటు.. ఒక డోసు ఎంతంటే?
శ్రీనగర్, గ్వాలియర్ పేర్లు సిఫార్సు
ఆర్కిటెక్ట్‌లు, టౌన్ ప్లానర్‌లు, ల్యాండ్‌స్కేపర్లు, పౌరులు సరికొత్త సుస్థిర నగరాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే అన్నారు. నగరాల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి దేశాలతో కలిసి పనిచేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నామని ఆయన చెప్పారు. యునెస్కో ఇటువంటి దృక్పథాలను ప్రోత్సహిస్తోందన్నారు. భారత జాతీయ కమిషన్ ఫర్ కోపరేషన్ (INCCU) యునెస్కోకు శ్రీనగర్, గ్వాలియర్ సిటీలను సిఫార్సు చేసింది. కానీ జమ్ము కశ్మీర్ వేసవి రాజధాని అయిన శ్రీనగర్ ఈ జాబితాలో స్థానం సంపాదించింది. ఇప్పటికే భారత్ నుంచి హైదరాబాద్, ముంబయి అక్టోబర్ 2019లో ఈ జాబితాలో స్థానం పొందాయి.
Also Read: ఆరోజు నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఈసారి ఇవే హాట్ టాపిక్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి