తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తాత్కాలిక ఉద్యోగులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు. తీవ్ర ఆందోళనలో ఉన్న టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్(Out Sourcing) ఉద్యోగుల విషయంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టనుంది.
Also Read: ఏపీ, తెలంగాణకు కేఆర్ఎంబీ ఛైర్మన్ లేఖ.... శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు అప్పగించాలని ఆదేశాలు
సొసైటీల రద్దుపై కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన
వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే ఆప్కాస్(APCOS) కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు దీని ద్వారా చెల్లిస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీలో కూడా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీలో గడువు ముగిసిన కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ కాలం పొడిగించవద్దని, కొత్తగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏజెన్సీలు, ఇతర సంస్థలకు ఉద్యోగులను నియమించవద్దని టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఉన్న సొసైటీలను రద్దు చేసి, కార్పొరేషన్(Corporation) ఏర్పాటు ఎందుకు వారంతా ప్రశ్నిస్తున్నారు. తమ ఉద్యోగాలకు ఎసరుపెడుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
Also Read: రసవత్తరంగా నెల్లూరు ఎన్నికలు... కండువాలు మార్చేస్తున్న అభ్యర్థులు... తాజా లిస్ట్ ఇదే..!
కొత్తగా కార్పొరేషన్ ఎందుకు?
ఆందోళనలో ఉన్న టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులకు జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. 2010లో టీటీడీ 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిందని, అదే విధంగా సొసైటీలు ఏర్పాటయ్యాయని పవన్ తెలిపారు. మరి ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ ఎందుకని ప్రశ్నించారు. ఉన్న వ్యవస్థను మార్చే సమయంలో చాలా జాగ్రత్తగా వహించాలని కానీ వైసీపీ సర్కార్(Ysrcp Govt) తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పవన్ విమర్శించారు. కార్పొరేషన్ నిర్ణయం విఫలమవుతుందని పవన్ వ్యాఖ్యానించారు.
Also Read: పెట్రో ధరల తగ్గింపుపై చేతులెత్తేసిన తెలుగు రాష్ట్రాలు... తగ్గించేదిలే అని ప్రభుత్వాలు స్పష్టం...!
సుప్రీం తీర్పు ఉల్లంఘన
ఒకే పనిచేస్తున్న రెగ్యులర్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకు ఒకే వేతనం చెల్లించాలని జస్టిస్ జేఎస్ ఖేహార్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు(Supreme Court) 2016లో వెలువరించిన తీర్పును పవన్ గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం ఆ తీర్పును ఉల్లంఘించిందని పవన్ అభిప్రాయపడ్డారు. కార్పొరేషన్ లో చేరని ఉద్యోగులను తొలగిస్తామని బెదిరిస్తున్నారని పవన్ ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులను కార్పొరేషన్ లో చేరాలని ఒత్తిడి చేయడం లేబర్ చట్టాలను(Labour Acts) ఉల్లంఘించటమే అవుతుందని పవన్ కల్యాణ స్పష్టం చేశారు.
Also Read: ఏపీకి పాలు సరఫరా బంద్.... రూ.130 కోట్ల బకాయిలు చెల్లించండి... ఏపీకి కర్ణాటక లేఖ