కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకునే అంశంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లకు కేఆర్ఎంబీ ఛైర్మన్ లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తక్షణమే అప్పగించాలని కేఆర్ఎంబీ ఛైర్మన్ లేఖలో కోరారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ తో పాటు వాటి అనుబంధ 15 ప్రాజెక్టులను తక్షణమే అప్పగించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ కోరారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ జులై 15న గెజిట్ నోటిఫికేసన్ విడుదల చేసింది. ఈ గెజిట్‌ను అక్టోబర్ 14వ తేదీ నుంచి అమలు చేయాల్సిన తెలిపింది. గెజిట్ అమలుపై ఇప్పటి వరకూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ తరుణంలో కేఆర్ఎంబీ ఛైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు తాజాగా లేఖలు రాశారు.
Also Read: మళ్లీ తెరపైకి ఈటల భూ వ్యవహారం .. నోటీసులు జారీ చేసిన అధికారులు !
అమలుకు నోచుకోని గెజిట్
శ్రీశైలం స్పిల్ వే, కుడి గట్టు విద్యుత్ కేంద్రం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ-నీవా (మల్యాల, ముచ్చుమర్రి పంప్ హౌస్), సాగర్ కుడి కాలువ విద్యుత్ కేంద్రాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ అక్టోబర్ 14న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల, సాగర్ స్పిల్ వే, ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎఎమ్మార్పీ, సాగర్ వరద కాలువ, సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్, విద్యుత్ కేంద్రం, సాగర్ కుడి కాల్వలను బోర్డు పరిధిలోకి తెలంగాణ ఇచ్చినప్పుడే తమ ప్రాజెక్టులను బోర్డుకు స్వాధీనం చేస్తామని షరతు పెట్టింది. దీంతో కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు నోచుకోలేదు. ఇప్పటి దాకా 9 అవుట్ లెట్లను బోర్డుకు స్వాధీనం చేయడంపై తెలంగాణ సర్కార్ ఎలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదు. దీంతో కేఆర్ఎంబీ నోటిఫికేషన్ అమలుకు వీలుగా తక్షణమే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తూ తెలుగు రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన కార్యాలయాలు, సిబ్బంది, వాహనాలను బోర్డుకు అప్పగించాలని కేఆర్ఎంబీ ఛైర్మన్ లేఖలో పేర్కొన్నారు.
Also Read: అనంత విద్యార్థులపై విరిగిన లాఠీ... ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత
గెజిట్ పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు ప్రాజెక్టులను అప్పగించడంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు ఒక డ్రామా అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణృ జల కేటాయింపుల అంశాన్ని తక్షణమే ట్రిబ్యునల్‌కు సిఫార్సు చేయాలన్నారు. సెక్షన్-సి కింద కేంద్రం ఎందుకు సిఫార్సు చేయడంలేదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
Also Read: తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు.. 74 రోజుల తర్వాత బయటకు..