ప్రాచీన భారతదేశంలో మగధ చాలా గొప్ప సామ్రాజ్యం. ఆ రోజుల్లో 16 గొప్ప రాజ్యాల్లో మగధ ఒకటి అని భావించేవారు. ప్రాచీన భారతదేశ సంస్కృతి, వైభవానికి ఈ రాజ్యం గొప్పకేంద్రం. ఇలాంటి రాజ్యంలో చనక రుషిగా ప్రసిద్ధుడైన గొప్ప పండితుడు చనకుడు. ఈయన కుమారుడే చాణక్యుడు. చనకుడి కుమారుడు కావడం వల్లే చాణక్యుడు అయ్యాడు. అయితే చిత్రం ఏంటంటే చాణక్యుడు దంతాలన్నింటితో జన్మించాడు. సాధారణంగా దంతాలతో జన్మించిన వారు కింగ్ అవుతారని అంటారు. కుల ధర్మానికి వ్యతిరేకంగా కుమారుడు చక్రవర్తి కావడం తండ్రికి ఇష్టం లేదు. ఎందుకంటే తమని బ్రాహ్మణ వంశం. ఈ వంశానికి చెందిన వాడు బ్రాహ్మణధర్మం నిర్వర్తించాలి కానీ క్షత్రియ ధర్మం నిర్వహించకూడదు. ఈ ఉద్దేశంతో చనకుడు ఓ రాయి తీసుకుని కుమారుడి పళ్లు విరగ్గొట్టేందుకు ప్రయత్నించాడు. కొన్ని పగిలాయి, మరికొన్ని సగం సగం విరిగి అలాగే ఉండిపోయాయి. దీంతో చాణక్యుడి ముఖం వికారంగా తయారైంది. అసలే నలుపు, ఆపై విరిగి పళ్లు చూసేందుకే భయపడేవారంతా.
Also Read: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?
అందగాడు కాకపోతేనేం అద్భుతమైన తెలివితేటలున్నవాడు చాణక్యుడు. బాల్యంలోనే నాలుగు వేదాల్లో అపారమైన పాండిత్యాన్ని సంపాదించాడు.కొడుకు తెలివితేటలు చూసి తండ్రి చనకుడు చాణక్యుడిని తక్షశిల విశ్వవిద్యాలయంలో చేర్పించాడు. చాణక్యుడు తరగతి గదిలోకి రాగానే వికృత రూపాన్ని చూసి విద్యార్థులంతా గేలి చేశారు. కానీ కొన్నాళ్లు గడిచేసరికి అపూర్వ ప్రజ్ఞ, ధారణాశక్తి ఏ స్థాయిలో ఉందో వారికి అర్థమైంది. దీంతో అప్పటి వరకూ రూపం చూసి భయపడిన వారంతా గౌరవంతో దగ్గరకు చేరడం ప్రారంభించారు. కొన్నాళ్లు విద్యాభ్యాసం అనంతరం అక్కడే ఆచార్యుడిగా విధులు నిర్వర్తించాడు చాణక్యుడు. అతడిని విద్యార్థులు వైస్ ఛాన్సలర్ గా సంబోధించేవారు. విద్యార్థులకు అత్యంత ప్రియమైన ఆచార్యుడిగా మారిపోయాడు. ఎందరో అభిమాన శిష్యులు ఉండేవారు. కానీ చిన్నప్పటి నుంచీ తన మనసులో కురూపి అనే ఫీలింగ్ మనసులో అలాగే ఉండిపోయింది. అయితే దంతాలతో జన్మించిన వ్యక్తి కింగ్ అవుతాడని తండ్రి భయపడినట్టే.. కింగ్ అవకపోయినా కింగ్ మేకర్ మాత్రం అయ్యాడు చాణక్యుడు.
Also Read: ఈ యూనివర్శిటీలో సిలబస్ ఉండదు...కోర్సుకి కాలపరిమితి లేదు…పరీక్షలుండవు.. నేర్చుకున్న విద్యే కొలమానం…
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Chankya Neethi: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
ABP Desam
Updated at:
09 Nov 2021 08:53 AM (IST)
Edited By: RamaLakshmibai
పళ్లతో పుట్టాడని తండ్రి కురూపిగా మార్చాడు... ఆ రూపం శాపంగా మారి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ వాటిని అధిగమించి నేటికీ దిశానిర్దేశం చేస్తున్నాడు విష్ణుగుప్తుడు(చాణక్యుడు).
చాణక్య నీతి
NEXT
PREV
Published at:
09 Nov 2021 08:53 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -