బ్రెయిన్ స్ట్రోక్ ఒకప్పుడు చాలా అరుదుగా వచ్చేది. ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తోంది. దానికి కారణం మారుతున్న ఆరోగ్యపు అలవాట్లు, తింటున్న ఆహారమే. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మనిషిలా మళ్లీ సాధారణంగా బతకడానికి చాలా సమయం పడుతుంది. కొంతమందికి మరణం కూడా సంభవించచ్చు. ఇదంతా స్ట్రోక్ వచ్చే తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. 


బ్రెయిన్ స్ట్రోక్ అంటే?
శరీరాన్ని నడిపించేది మెదడే. మెదడుకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం, రక్త సరఫరా ఆగిపోవడం లేదా తీవ్ర అంతరాయం ఏర్పడడం జరుగుతుంది. అప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్ కూడా అందదు. ఏ భాగానికైతే రక్తప్రసరణ, ఆక్సిజన్ అందడం ఆగిపోతుందో... అక్కడి మెదడు కణాలు మరణిస్తాయి. అప్పుడు స్ట్రోక్ కలుగుతుంది. ఇలా జరిగినప్పుడు సకాలంలో చికిత్స అందించాలి. లేకుంటే నష్టం తీవ్రంగా ఉంటుంది. స్ట్రోక్ లు రెండు రకాలు ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. 


ఈ అలవాట్లు మానుకోవాల్సిందే


1. ఈస్ట్రోజన్ కలిగి ఉన్న హార్మోన్ థెరపీలు అధికంగా తీసుకోవడం లేదా గర్భనిరోధక మాత్రలు అధికంగా వినియోగించడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 
2. మాదక ద్రవ్యాల అలవాటు ఉన్న వారికి స్ట్రోక్ కలిగే అవకాశం ఎక్కువ. కొకైన్, మెథాంఫెటమైన్ వంటి డ్రగ్స్ వాడే వారు స్ట్రోక్ బారిన పడే ఛాన్సులు ఉన్నాయి. 
3. ఊబకాయం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఊబకాయం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ మాత్రమే కాదు ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు సులువుగా దాడి చేస్తాయి. 
4. ధూమపానం అలవాటు ఉంటే వెంటనే వదులుకోండి. ఇది మీ గుండె, శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అలాగే స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. పొగతాగడం హఠాత్తుగా మానేయలేని వారు మెల్లగా తగ్గించుకుంటూ రావాలి. చివరికి మానేయడం ఉత్తమం. 
5. అధికంగా మద్యం తాగేవారిలో కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాద శాతం పెరిగిపోతుంది. మద్యం సడెన్ మానేయడం బానిసలుగా మారిన వారికి కష్టమే. అందుకే ముందుగా తగ్గించుకోవడం ఉత్తమం. నాలుగు గ్లాసులు తాగే చోట రెండు గ్లాసులు మాత్రమే తాగండి. కొన్నాళ్లకు పూర్తిగా మానేయడానికి ప్రయత్నించండి. మద్యం వల్ల కేవలం స్ట్రోక్ సమస్య కాదు కాలేయం కూడా చెడిపోతుంది. 
6. హైబీపీ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి. షుగర్ లెవెల్స్ ఎప్పుడూ నియంత్రణలో ఉండేట్టు చూసుకోండి. ఈ రెండూ కూడా స్ట్రోక్ కు కారణమవుతాయి. 
7. అన్నింటికన్నా ముఖ్యంగా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. సమస్యలను మనుసులో పెట్టుకుని మధన పడడం మానేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: చలికాలంలో వేడి పుట్టించే నువ్వులు తినడం అవసరమే


Also read: వాయుకాలుష్యం డిప్రెషన్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది జాగ్రత్త... హెచ్చరిస్తున్న కొత్త అధ్యయనం


Also read: గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటున్న ద్రాక్షాయణి


Also read: జుట్టురాలిపోకుండా ఒత్తుగా పెరగాలా... చక్కటి పరిష్కారం విటమిన్ ఇ


Also read: బిగ్‌బాస్‌లో జెస్సీ వ్యాధి ఇదే, వర్టిగో లక్షణాలు... వామ్మో చుక్కలు చూపిస్తాయి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి