Signs He’s Not Into You : అబ్బాయిలు వద్దనుకుంటే అమ్మాయిలను ఇలా దూరం పెడతారట.. మూవ్ ఆన్ అవ్వాల్సిన టైమ్ ఇదే
అబ్బాయిలు తాము ప్రేమించిన అమ్మాయిలను లేదా ఇష్టపడిన అమ్మాయిలు బోర్ కొడితే కొన్ని సిగ్నల్ ఇస్తారట. వారితో బంధాన్ని తెంచుకునేందుకు అబ్బాయిలు ఏమి చేస్తారో ఇప్పుడు చూసేద్దాం.
అబ్బాయిలు వద్దు అనుకుంటే కాల్స్, మెసేజ్‌లు చేయరట. గతంలో చేసినట్టు అతను మీతో కమ్యూనికేషన్‌ని చేయడట. మాట్లాడటం కూడా చాలా ఫోర్స్ చేసినట్టు మాట్లాడతారట. మీరు మాట్లాడమని అడిగినా కూడా సరిగ్గా రెస్పాండ్ కారట.
ఎమోషనల్‌గా కూడా దూరమవుతారట. తన ఫీలింగ్స్ కూడా బయటకు చెప్పరట. ఎమోషనల్ టాక్స్‌ని పూర్తిగా అవాయిడ్ చేస్తారట. మిమ్మల్ని పరాయి వ్యక్తిగా ట్రీట్ చేస్తారట.
పనిలో బిజీగా ఉన్నానంటూ.. మీ ప్లానింగ్స్ని లాస్ట్‌లో క్యాన్సిల్ చేస్తూ.. మిమ్మల్ని మీట్ అవ్వడాన్ని, మాట్లాడటాన్ని తగ్గిస్తారట. మీతో వారికి ఏమి ప్లాన్స్ ఉండవు.
మునుపెన్నడు లేని విధంగా రూడ్‌గా ఉంటారట. ముందు ఉండే ప్రేమ, సెన్సిటివిటీ అంతా పోతుంది. మీరు ఏమి చేసినా వారు త్వరగా ఇరిటేట్ అయిపోవడం, కామెడీ చేయడం, సిల్లీ జోక్స్‌ని కూడా సీరియస్‌గా తీసుకోవడం చేస్తారట.
హగ్ చేసుకోవడం, కిస్, ప్రేమకు సంబంధించిన ఏ సంజ్ఞలు వారు మీతో చేయడానికి ఇష్టపడరట. ఫిజికల్‌గా కూడా మిమ్మల్ని దూరం పెడతారట.
మీరు అతనిని మార్చడానికి ట్రై చేసినా మీరు వారికి రెడ్ ఫ్లాగ్ లాగానే కనిపిస్తారు. కాబట్టి అమ్మాయిలు మీ బాయ్ ఫ్రెండ్ లేదా పార్టనర్ ఇలా మిమ్మల్ని అవాయిడ్ చేస్తే సైలెంట్‌గా మూవ్ ఆన్ అయిపోండి.