బిగ్‌బాస్‌ హౌస్లో వర్టిగోతో జెస్సీ కొన్ని రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సరిగా నడవలేకపోతున్నాడు, నిల్చోలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు. అతడిని చూసిన ప్రేక్షకులందరికీ ఇప్పుడు వర్టిగో గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిపోయింది. అందుకే వర్టిగో అంటే ఏంటో వివరించే ప్రయత్నం చేస్తున్నాం...


ఏంటీ వర్టిగో...
విపరీతంగా తలతిరిగినట్టు అనిపిస్తుంది. నిల్చుంటే పట్టుకోల్పోయి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. మీరు రంగుల రాట్నం ఎక్కి దిగాక ఎలా అనిపిస్తుందో ఓసారి గుర్తు తెచ్చుకోండి... ఇంకా గిరాగిరా తిరుగుతున్న ఫీలింగే కలుగుతుంది. అలాగే అనిపిస్తుంది వర్టిగో ఉన్నవారికి. గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఏదీ తన అదుపులో ఉన్నట్టు అనిపించదు. చుట్టుపక్కల ఉన్న వస్తువులు, మనుషులు కూడా తిరుగుతున్నట్టే అనిపిస్తుంది వర్టిగో ఉన్నవాళ్లకి. చెవిలో హోరుమనే శబ్ధాలు వినిపించడంతో పాటూ, మధ్యలో వాంతులు కూడా అవుతుంటాయి. 


ఎందుకు వస్తుంది?
చెవి లోపలి భాగంలో సమస్యలు (బ్యాలెన్స్ సమస్యలు) ఏర్పడడం వల్ల ఒక్కోసారి వెర్టిగో వస్తుంది. మెదడులో కొన్ని భాగాలలో సమస్య ఉన్నా కూడా వెర్టిగో ఏర్పడే అవకాశం ఉంది. మైగ్రేన్ వల్ల కూడా ఒక్కోసారి ఈ ఆరోగ్యసమస్య రావచ్చు. 


చికిత్స ఇలా...
వర్టిగో కొందరిలో వచ్చినట్టే వచ్చి పోతుంది. కానీ కొందరికి మాత్రం కచ్చితంగా మందులు వాడడం అవసరం. వైద్యులు  యాంటీ బయోటిక్స్, యాంటీ వైరల్ మందులను సూచిస్తారు. పరిస్థితి మరీ సీరియస్ గా ఉంటేనే చిన్న సర్జరీ అవసరం పడొచ్చు. 


వారసత్వంగా వస్తుందా?
వర్టిగో వంశపారంపర్యంగా తప్పనిసరిగా వస్తుందని చెప్పలేం. అలాగని రాదని చెప్పలేం.  చాలా సమస్యలకు ఒత్తిడి కారణం అయినట్టే వర్టిగోకు కూడా అది కారణం అయి ఉండొచ్చని అనుకుంటారు చాలామంది. కానీ వర్టిగోకు, ఒత్తిడికి ప్రత్యక్ష బంధం లేదు. వర్టిగో ఉన్న వాళ్లకి ఒత్తిడి కూడా కలిగితే సమస్య తీవ్రంగా మారుతుంది.  


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: జుట్టురాలిపోకుండా ఒత్తుగా పెరగాలా... చక్కటి పరిష్కారం విటమిన్ ఇ


Also read: సముద్రపు చేపలే ఆరోగ్యానికి మంచివంటున్న అధ్యయనాలు... తింటే ఎన్ని లాభాలో
Also read: పాదాలకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి? బంగారపువి ఎందుకు ధరించకూడదు?
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మనసు స్థిరంగా లేదా, ఆందోళనగా అనిపిస్తోందా... వీటిని తినండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి