సముద్రపు చేపలు వర్సెస్ చెరువు చేపలు టాపిక్ ఇప్పటిది కాదు. గత పదేళ్లుగా ఏవి మంచివో చెప్పేందుకు అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం సముద్రపు చేపల వల్ల ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని బయటపడింది. ఎన్నో రకాల అనారోగ్యాలను తట్టుకునే శక్తి కూడా సముద్రపు చేపలు అందిస్తాయని తెలిపింది ఓ పరిశోధన.  ఎందుకంటే చేపల చెరువుల్లో వాటిని పెంచే యజమాని పెట్టి ఆహారాన్నే చేపలు తింటాయి. ఆ ఆహారాన్ని బట్టి చేపల్లోనూ పోషకాలు పెరుగుతాయి. కానీ సముద్రంలో స్వేచ్ఛగా తిరిగే చేపలు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను ఇచ్చే మొక్కలను తింటాయి. సముద్రపు అడుగున ఉండే మొక్కల్ని తినే చిన్నచేపల్ని, పెద్ద చేపలు ఆరగిస్తాయి. పెద్ద చేపల్ని వాటికన్నా పెద్ద చేపలు తింటాయి. అలా మొక్కల నుంచి వచ్చే పోషకాలు కూడా సముద్రపుచేపల్లో లభిస్తాయి. కాబట్టి సీఫుడ్ చాలా మంచిదని వాదించే పరిశోధకులు ఉన్నారు. 


1. సముద్రపు తరచూ తినేవాళ్లలో కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాదు కంటి సమస్యలు కూడా త్వరగా దాడిచేయవు.  రేచీకటి రాకుండా ఇందులోని పోషకాలు అడ్డుకుంటాయి. రేచీకటి ఉన్న వాళ్లు తరచూ సముద్రపు చేపలు తింటే మంచిది. 
2. వయసుపెరిగేకొద్దీ ఆర్ధరైటిస్ దాడిచేసేందుకు సిద్ధంగా ఉంటుంది. ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆర్దరైటిస్ నొప్పులను ఇవి తగ్గిస్తాయి. శరీరంలో ఇన్ ప్లమ్మేషన్ ను కూడా తగ్గిస్తుంది. అంటే లోపల ఏ అవయవాలకు వాపుల్లాంటివి రానివ్వదు. 
3. ఈ చేపల్లో విటమిన్ డి కావాల్సినంత లభిస్తుంది. ఈ విటమిన్ వల్ల శరీరం కాల్షియాన్ని శోషించుకునేలా చేస్తుంది. దీనివల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. 
4. చిన్న పిల్లలకు తరచూ సముద్రపు చేపలు తినిపిస్తే మంచిది. వారిలో ఎముకల పెరుగుదల బావుంటుంది. భవిష్యత్తులో వీరికి చాలా ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. 
5. రోగనిరోధక శక్తి పెరిగేందుకు సీఫుడ్ సహకరిస్తుంది. ఇందులో జింక్ అధికంగా ఉంటుంది. కేవలం చేపలే కాదు సముద్రంలో పెరిగే పీతలు, రొయ్యల్లో కూడా జింక్ అధికంగా ఉంటుంది. ఇవి శరీరానికి విటమిన్ ఏ, సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
6. గుండె ఆరోగ్యానికిన కూడా ఈ చేపలు ఎంతో మంచి చేస్తాయని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. వారంలో కనీసం ఒక్కసారైన సముద్రపు చేపలు తింటే మంచిది. గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
7. చదువుకునే పిల్లలకు ఈ చేపలను పెట్టడం వల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. చిన్నప్పట్నించి సీఫుడ్ తినేవారిలో పెద్దయ్యాక మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. 
8. ఒత్తిడిని తట్టుకునే శక్తిని అందిస్తుంది సీఫుడ్. ఎవరైతే సముద్రపు చేపలు తరచూ తింటారో వారు డిప్రెషన్ బారిన తక్కువ పడతారని చెబుతున్నాయి ఎన్నో పరిశోధనలు. 
9. అందమైన చర్మానికి ఈ చేపలు ఎంతో సహకరిస్తాయి. చర్మానికి మెరుపునిస్తుంది. అంతేకాదు సూర్యుని కాంతిలో ఉండే హానికారక అతినీలలోహిత కిరణాలను తట్టుకునే శక్తిని చర్మానికి ఇస్తుంది. అమ్మాయిల్లో మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: పాదాలకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి? బంగారపువి ఎందుకు ధరించకూడదు?
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మనసు స్థిరంగా లేదా, ఆందోళనగా అనిపిస్తోందా... వీటిని తినండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి