సిక్స్‌ప్యాక్‌ హీరోల్లో కార్తికేయ గుమ్మకొండ ఒకరు. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారు. 'ఆర్ఎక్స్ 100' నుంచి ఇప్పటివరకూ సేమ్ ఫిజిక్‌ మెయింటైన్ చేస్తున్నారు. అంతలా బాడీ మెయింటైన్ చేయడం కష్టమని కార్తికేయ చెప్పారు. అయితే... తన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని ఆయన వివరించారు. 'ఆర్ఎక్స్ 100'లో హీరోగా అవకాశం రావడానికి... తర్వాత 'గ్యాంగ్ లీడర్', ప్రస్తుతం తమిళంలో అజిత్ 'వలిమై'లో విల‌న్‌గా చేసే ఛాన్స్‌ రావడానికి తన బాడీయే కారణం అని కార్తికేయ తెలిపారు. కొత్త సినిమా 'రాజా విక్రమార్క' విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో కార్తికేయ ముచ్చటించారు.


"దర్శకుడు అజయ్ భూపతితో "నేను యాక్టింగ్ చేస్తానని నేను మీకు ఎలా తెలుసు? హీరోగా నన్ను ఎందుకు తీసుకున్నారు?' అని అడిగా. 'నీకు మంచి ఫిజిక్ ఉంది. యాక్టింగ్ నేను చేయించుకోగలను అని తీసుకున్నా' అన్నాడు. 'గ్యాంగ్ లీడర్'కు విక్రమ్ కె. కుమార్‌, 'వలిమై'కి హెచ్ వినోద్ నన్ను ఎంపిక చేసుకోవడానికి కారణం కూడా నా బాడీయే. అయితే... సెట్స్‌కు వెళ్లిన తర్వాత నా యాక్టింగ్ చూసి స‌ర్‌ప్రైజ్ అయ్యారు. ఎమోషనల్ సీన్స్, ఇంటెన్స్ యాక్టింగ్ చూసి మెచ్చుకున్నారు. ఇలా బాడీ మెయింటైన్ చేయడం కష్టమే. దాని వల్ల అవకాశాలు వస్తున్నప్పుడు కష్టపడొచ్చు" అని కార్తికేయ తెలిపారు. అయితే... ఈ శుక్రవారం విడుదలవుతున్న 'రాజా విక్రమార్క'లో సిక్స్‌ప్యాక్‌ చూపించిందీ, లేనిదీ చెప్పలేదు. సినిమాలో చూడమని చెప్పారు. 
Also Read: కాన్ఫిడెంట్‌గా కార్తికేయ నిర్మాతలు... నైజాంలో సొంతంగానే!


'రాజా విక్రమార్క' సినిమా గురించి కార్తికేయ మాట్లాడుతూ "ఇంత కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ నేనిప్పటి వరకూ చేయలేదు. సినిమాలో యాక్షన్ , నా డ్రస్సింగ్ స్ట‌యిలిష్‌గా, క్లాసీగా ఉంటాయి. కథలో భాగంగా కామెడీ, యాక్షన్ ఉంటాయి. ఇంతకు ముంది సినిమాల్లో యాక్షన్ చేశా. ఇందులో బయట నేను ఎంత సరదాగా ఉంటానో, అలా కనిపిస్తా. ఎన్ఐఏ ఏజెంట్ అంటే... బోర్డ‌ర్‌లో జ‌రిగే క‌థ కాదు. దేశం లోపల జరిగే కథ. ఎంతైనా ఏజెంట్ రోల్ కదా! అందుకని, గన్ ఎలా పట్టుకోవాలి? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? అని కొంత రీసెర్చ్ చేశా. దర్శకుడితో ఎక్కువ డిస్కస్ చేశా" అని చెప్పారు.
Also Read: 'పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు.. ఓటమి' రాజా విక్రమార్క ట్రైలర్..


చిరంజీవి మీద అభిమానంతో 'రాజా విక్రమార్క' టైటిల్ సినిమాకు పెట్టామని కార్తికేయ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "కథకు టైటిల్ సూటవుతుందని మా దర్శకుడు శ్రీ సరిపల్లి చెప్పిన తర్వాత ముందు టైటిల్ ఉందా? లేదంటే ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నారా? అని చెక్ చేశాం. ఉందని తెలిశాక వెంటనే రిజిస్టర్ చేశా. తర్వాత చిరంజీవిగారికి విషయం చెప్పాను. ఆయన 'గుడ్ లక్' అని మెసేజ్ చేశారు. అభిమానిగా ఆయన సినిమా టైటిల్ నా సినిమాకు పెట్టుకున్నానని శాటిస్‌ఫ్యాక్ష‌న్‌, సంతోషం. అభిమానులు కొందరు పిల్లలకు హీరో పేరు పెట్టుకుంటారు. అలాగే ఇది" అని అన్నారు.
Also Read: అప్పటికే మా తాతయ్య మరణించారు! ఆయన ఉండి ఉంటే...


ఇకపై ఓ ప్రేక్షకుడికి కథ విని సినిమాలు చేస్తానని కార్తికేయ చెప్పారు. 'రాజా విక్రమార్క' ప్రేక్షకుడిగా చేసిన చిత్రమేనని తెలిపారు. ఇండస్ట్రీలో ఇతర హీరోలతో స్నేహం గురించి మాట్లాడుతూ "మనం నెగెటివ్‌గా ఉండకపోతే... ఎదుటి వ్యక్తి మన గురించి నెగెటివ్‌గా అనుకోరు. మనం పాజిటివ్‌గా ఉంటే అందరూ పాజిటివ్‌గా ఉంటారు. బేసిగ్గా... మనం ఎలా ఉంటే ఎదుటి వాళ్లు అలా ఉంటారని నా నమ్మకం. మనలోపల నెగెటివ్ ఫీలింగ్స్ ఉంటే ఎదుటివాళ్లకు తెలుస్తుంది" అని కార్తికేయ అన్నారు.
Also Read: పెళ్లి కబురు చెప్పిన కార్తికేయ... ఆ తర్వాత కాబోయే భార్యను పిలిచి!


'వలిమై'తో కార్తికేయ తమిళ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా, అజిత్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ గురించి మాట్లాడుతూ "నేను సెట్‌కు వెళ్లిన తొలి రోజు మామూలు స‌న్నివేశాలు తీశారు. రెండో రోజు అజిత్‌గారితో స‌న్నివేశాలు తీశారు. ఆయ‌న పెద్ద స్టార్‌. ఆయ‌న ద‌గ్గ‌ర ఎలా బిహేవ్ చేయాలో అనుకున్నాను. ఆయన్ను కలిసే వరకూ టెన్షన్ పడ్డాను. కలిసిన తర్వాత... ఒక నిమిషంలో చాలా  కంఫ‌ర్ట‌బుల్‌గా ఉండవచ్చ‌నే వైబ్ అజిత్ గారు ఇచ్చేశారు. 'వలిమై'లో డిఫరెంట్, ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చూడని స్టంట్స్ చేశా. ఒక స్టంట్ చేసేటప్పుడు నా ముందే అజిత్ గారికి యాక్సిడెంట్ అయింది. అప్పుడు భయమేసింది. కానీ, సినిమా మేకింగ్ నన్ను ఎంతో ఇన్‌స్ఫైర్‌ చేసింది. నా బెస్ట్ ఇచ్చాను" అని అన్నారు.
Also Read: 'రాజా విక్రమార్క' సినిమాకు... జేడీ లక్ష్మీనారాయణకు ఓ సంబంధం ఉంది! అదేంటో తెలుసా?


ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ఒక సినిమా, శివలెంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్‌లో మరో సినిమా, క్లాక్స్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నట్టు కార్తికేయ తెలిపారు. ఈ నెల 21న లోహితతో ఏడడుగుల బంధంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి వల్ల సినిమా చిత్రీకరణలకు కొంత విరామం ఇవ్వనున్నారు.

Also Read: ఎన్టీఆర్... రామ్ చరణ్... నాటు నాటు... ఊర నాటు! ప్రేక్షకులు చిందేసేట్టు!!
Also Read: సంక్రాంతి తర్వాతే కొరటాల సెట్స్‌కు యంగ్ టైగర్... పక్కా ప్లాన్ రెడీ!
Also Read: కందిసేను కాడ... పంపుషెడ్డు కాడ... డాంట‌కు డ‌డ‌న‌! 'బంగార్రాజు' లడ్డుండా!!
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి