'ఆర్ఎక్స్100' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కార్తికేయ. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తరువాత మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయారు. కానీ సరికొత్త కథలను ఎన్నుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'రాజా విక్రమార్క'. ఈ సినిమాతో శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 


Also Read: మలయాళ 'బాహుబలి'ని ఓటీటీకి ఇచ్చేశారుగా..


ట్రైలర్ లో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో హీరో కనిపించాడు. హోమ్ మినిష్టర్ కి థ్రెట్ ఉండడంతో.. హీరోని ఎరగా వేస్తారు. అలా సాయం చేయడానికి వెళ్లిన హీరో.. హోమ్ మినిష్టర్ కూతురితో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జైల్లో ఉన్న తమిళ నటుడు పశుపతిని చూపిస్తూ.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. 'పన్నెండేళ్ల అరణ్యవాసం.. ఏడాది అజ్ఞాతవాసం చేశాక.. పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు.. ఓటమి' అంటూ ఆయన చెప్పే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ఆ తరువాత హీరో సీరియస్ మోడ్ లో కనిపించాడు. జైల్లో కూడా ఉన్నట్లు చూపించారు. 


కొన్ని సీరియస్ సన్నివేశాలను చూపించిన తరువాత హీరో ఒక వ్యక్తి గొంతులో గన్ పెట్టి.. 'ఇప్పుడు నాకు తెలియాల్సింది ఒక్కటే.. ట్రిగ్గర్ నొక్కనా..? వొద్దా..?' అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. చివరిగా గ్రనేడ్, గన్స్ ను చెక్ చేస్తూ.. 'దివాలి గ్రాండ్ గానే ప్లాన్ చేశావ్' అంటూ మరో డైలాగ్ చెప్తాడు హీరో. ఇక ట్రైలర్ లో తనికెళ్ల భరణి క్యారెక్టర్ హైలైట్ గా నిలిచింది. సుధాకర్ కొమ్మాకుల మరో ముఖ్య పాత్రలో కనిపించారు. తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేయబోతున్నారు.