సీనియర్ హీరోల వారసులు హీరోలుగా రావడం కామన్. కానీ, హీరోయిన్లుగా? హిందీ సినిమా పరిశ్రమతో పోలిస్తే... తెలుగు, తమిళ పరిశ్రమలో వారసురాళ్లు హీరోయిన్లుగా, ఆర్టిస్టులుగా రావడం తక్కువ. తమిళంలో శ్రుతీ హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, తెలుగులో లక్ష్మీ మంచు, నిహారికా కొణిదెల తప్ప ఎక్కువమంది కనిపించరు. ఈ జాబితాలో తాన్యా రవిచంద్రన్ ఒకరు. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన 'రాజా విక్రమార్క'లో ఆమె కథానాయిక. మూడు నాలుగు తమిళ సినిమాలు చేసిన ఆమెకు తెలుగులో తొలి చిత్రమిది. ఈ నెల 12న సినిమా విడుదల కానుండటంతో పాత్రికేయులతో తాన్యా రవిచంద్రన్ ముచ్చటించారు.


తాను కథానాయిక అవ్వాలనుకుంటున్న విషయం తన తాతయ్యకు తెలియదని తాన్యా రవిచంద్రన్  చెప్పారు. "నాకు చిన్నతనం నుంచి నటన అంటే ఆసక్తి. సినిమాల్లోకి రావాలని ఉండేది. అయితే... మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్. అందుకని, ఎప్పుడూ తాతయ్యకు చెప్పలేదు. దురదృష్టవశాత్తూ... నేను హీరోయిన్ అవ్వడానికి కొన్నాళ్ల ముందు తాతయ్య మరణించారు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే... నేను చాలా సంతోషించేదాన్ని" అని తాన్యా రవిచంద్రన్ అన్నారు. తొలుత పీజీ చేసిన తర్వాత సినిమాలు చేయమని తల్లితండ్రులు సూచించినా... వరుస అవకాశాలు రావడంతో మూడు సినిమాలు చేసి, ఆ తర్వాత పీజీ పూర్తి చేశాక మళ్లీ సినిమాల్లోకి వచ్చానని ఆమె వివరించారు.
Also Read: 'పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు.. ఓటమి' రాజా విక్రమార్క ట్రైలర్..
తాన్యా రవిచంద్రన్ పదిహేనేళ్లుగా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నారు. 'రాజా విక్రమార్క'లో ఆమెది హోమ్ మినిస్టర్ డాటర్. కాలేజీకి వెళ్లే ఆ అమ్మాయి కూడా భరతనాట్యం డాన్సర్. బహుశా... తాను క్లాసికల్ డాన్సర్ కావడంతో దర్శకుడు శ్రీ సరిపల్లి సంప్రదించి ఉండొచ్చని తాన్య అభిప్రాయపడ్డారు. తనకు మాత్రం పాత్ర బాగా నచ్చిందన్నారు. "సినిమాలో నా పాత్ర పేరు కాంతి. హోమ్ మినిస్టర్ కుమార్తె అయినా చాలా సింపుల్ గా ఉంటుంది. సినిమాలో నా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కథతో పాటు క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే ఓకే చేశా" అని తాన్యా రవిచంద్రన్ చెప్పారు. హీరో కార్తికేయ ఫ్రెండ్లీ కోస్టార్ అని అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు. నిర్మాత '88' రామారెడ్డి, సమర్పకులు ఆదిరెడ్డి .టి బడ్జెట్ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా భారీ స్థాయిలో సినిమా నిర్మించారని ఆమె వివరించారు.
Also Read: కాన్ఫిడెంట్‌గా కార్తికేయ నిర్మాతలు... నైజాంలో సొంతంగానే!
ఆల్రెడీ తమిళ సినిమాలు చేసిన తాన్యా రవిచంద్రన్... తెలుగు, తమిళ పరిశ్రమల మధ్య వ్యత్యాసం ఏమీ లేదన్నారు. కమర్షియల్ సినిమాలు చేయడానికి తాను సిద్ధమని... అయితే ఐటమ్ సాంగ్స్ మాత్రం చేయలేనని ఆమె స్పష్టం చేశారు. తనకు తెలుగు అర్థమవుతుందని, అయితే వెంటనే మాట్లాడలేనని తెలిపారు. ప్రస్తుతం తాన్య తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నారట.


Also Read: ఎన్టీఆర్ కుడిచేతి వేలికి గాయం... సర్జరీ పూర్తి, ఇంట్లో విశ్రాంతి!
Also Read: కన్నీటి పర్యంతమైన సూర్య... దివంగత కథానాయకుడికి నివాళి
Also Read: హీరో రాజ‌శేఖ‌ర్‌కు పితృ వియోగం... శనివారం చెన్నైలో అంత్యక్రియలు
Also Read: మెగా ఫ్యామిలీ to ఎన్టీఆర్.. సెలబ్రిటీల ఇంట దీపావళి సందడి చిత్రాలు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి