కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఇంతకు ముందులా లేవు. సినిమాకు హిట్ టాక్ వస్తే... కలెక్షన్స్ వస్తున్నాయి. లేదంటే కష్టంగా ఉంటుంది. అందుకని, మంచి ఆఫర్లు వస్తే డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలు సినిమా ఇచ్చేస్తున్నారు. తమ సినిమా, కంటెంట్ మీద నమ్మకం ఉన్నవాళ్లు సొంతంగా విడుదల చేయాలనుకుంటున్నారు. కార్తికేయ గుమ్మకొండ లేటెస్ట్ మూవీ 'రాజా విక్రమార్క' నిర్మాతలు '88' రామారెడ్డి, ఆదిరెడ్డి .టి సైతం సొంతంగా విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు. నైజాంలో సొంతంగానే విడుదల చేస్తున్నామని వెల్లడించారు. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.


ఎన్.ఐ.ఎ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఏజెంట్‌గా కార్తికేయ నటించిన సినిమా 'రాజా విక్రమార్క'. ఆల్రెడీ రిలీజైన టీజర్ చూస్తే... స్ట‌యిలిష్‌గా ఉంది. ప్రొడక్ష‌న్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. గన్ ఫైర్ అయిన తర్వాత 'సారీ బాబాయ్! చూసుకోలేదు' అని కార్తికేయ అమాయకంగా చెప్పడం...  టీజర్ చివర్లో 'చిన్నప్పుడు కృష్ణగారిని, పెద్దయ్యాక టామ్ క్రూజ్‌ను చూసి ఆవేశపడి జాబ్‌లో జాయినయిపోయాం గానీ సరదా తీరిపోతుంది' అని కార్తికేయ అనడం చూస్తే... హీరో క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని అర్థమవుతోంది. 'ఆర్ఎక్స్ 100' స్థాయిలో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. 'ఆర్ఎక్స్ 100' కంటే 'రాజా విక్రమార్క' పెద్ద విజయం సాదిస్తుందని, కార్తికేయ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్ అవుతుందని '88' రామారెడ్డి, ఆదిరెడ్డి చెబుతున్నారు.


ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్', ఎన్టీఆర్ 'బాద్ షా', అజిత్ 'గ్యాంబ్లర్' సినిమాలను ఆదిరెడ్డి డిస్ట్రిబ్యూట్ చేశారు.  ధనుష్ 'రైల్' సినిమాను తెలుగులో విడుదల చేశారు. ఆ అనుభవంతో నైజాంలో సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ హిందీ డిజిటల్ రైట్స్ రూ. 3.25 కోట్లకు విక్రయించారు. ఏపీలో కొన్ని ఏరియాలు అమ్మేశారు. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం కొంతమంది మంచి ఆఫర్లు ఇచ్చారని తెలిసింది. దాంతో ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయినప్పటికీ... ప్రొడ్యూసర్స్ సేఫ్ సైడ్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాత '88' రామారెడ్డి, ఆదిరెడ్డి మరో రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతున్నారు. 'రాజా విక్రమార్క' స‌క్సెస్ మీట్‌లో కొత్త సినిమా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.


కార్తికేయ సరసన ఒకప్పటి తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య కథానాయికగా... సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల (నవంబర్) 12న విడుదల కానుంది. సోమవారం హీరో నాని చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కానుంది.






Also Read: చంద్రబాబుకు పగ్గాలు ఎందుకిచ్చావ్? - మోహన్ బాబు... ఎవరు ఆపుతారో చూద్దాం! - బాలకృష్ణ
Also Read: ఏడాదిన్న‌ర ఎదురుచూశా.... ప‌వ‌న్‌ క‌ల్యాణ్ నుంచి పిలుపు రాలేదు! - రాజ‌మౌళి
Also Read: ఓ కిలోమీటరు... ప్రభాస్ పరుగు ఆగలేదు... ఫ్యాన్స్‌కు పండగే!
Also Read: అర్ధరాత్రి హైద‌రాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?
Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి