భారత స్టాక్ మార్కెట్లలో మళ్లీ ఐపీవోల సందడి మొదలవ్వనుంది. నవంబర్ నెలలో ఏకంగా ఐదు కంపెనీలు పబ్లి్‌క్ ఇష్యూకు రానున్నాయి. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్, పాలసీ బజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్ ప్రథమార్థంలోనే లిస్టింగ్ అవ్వనున్నాయి. మొత్తం ఐపీవోల విలువ రూ.27000 కోట్లకు పైగా ఉండనుంది.
కేఎఫ్‌సీ, పిజ్జా హట్ ఔట్‌లెట్లను నిర్వహించే సఫైర్ ఫుడ్స్ ఇండియా, ఎస్‌జేఎస్ ఎంటర్‌ప్రైజెస్, మైక్రో క్రిస్టలైన్ సెల్యూలోజ్ తయారీ సంస్థ సిగాచీ ఇండస్ట్రీస్ ఇష్యూకు రానున్నాయి. ఇప్పటికే ఈ-టెయిలర్ నైకా, ఫినో పేమెంట్స్ బ్యాంక్ సేల్ మొదలు పెట్టాయి. నవంబర్ 1న నైకా, 2న ఫినో సబ్‌స్క్రిప్షన్ సేల్ ముగుస్తాయి. నైకా రూ.5,352 కోట్లు, ఫినో బ్యాంక్ రూ.1200 కోట్ల విలువతో ఐపీవోకు వస్తున్నాయి. మొత్తంగా నవంబర్లో లిస్ట్ అవుతున్న ఏడు కంపెనీల ఐపీవో విలువ రూ.33,500 కోట్లుగా ఉంది.
ప్రస్తుత షేర్ మార్కెట్లు బుల్లిష్‌గా ఉన్నాయి. మార్కెట్ విలువ, ప్రీమియం ఎక్కువగా లభిస్తాయని కంపెనీలు వరుస కడుతున్నాయి. 2021లో ఇప్పటి వరకు 41 కంపెనీలు మార్కెట్లో నమోదు అయ్యాయి. రూ.66,915 కోట్లు సమీకరించాయి. అన్నీ బాగుంటే ఈ ఏడాది ఐపీవో విలువ రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Godrej Group Split: గోద్రేజ్ గ్రూప్ విభజన: రెండుగా విభజించేందుకు సోదరుల కసరత్తు!!
Also Read: Dhanteras 2021: ఈ దంతేరాస్‌కి గోల్డ్ కాయిన్ రూ.1 కే కొనొచ్చు.. ఎలాగో తెలుసా, చాలా సింపుల్
Also Read: Aadhar Card Updates: ఆధార్ మిస్‌యూజ్ అవుతోందని డౌటా? ఫోన్‌కు ఓటీపీ రావడం లేదా? ఇలా తెలుసుకోండి!
Also Read: EPF Interest: కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం.. ఈపీఎఫ్ ఖాతాల్లోకి నగదు జమ అయ్యేది ఎప్పుడంటే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి