కరోనాపై పోరాటంలో భారత్ పాత్రపై ప్రధాని నరేంద్ర మోదీ.. జీ20 సదస్సు వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 చివరి నాటికి భారత్ 500 కోట్ల కొవిడ్ టీకా డోసులను ఉత్పత్తి చేసి కరోనా పోరాటంలో ప్రపంచానికి బాసటగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో దాదాపు 150 దేశాలకు వైద్య సాయం చేసి భారత్ అండగా నిలిచిందని గుర్తుచేశారు.
ఈ మేరకు జీ-20 సదస్సులో 'ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య సెషన్'లో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడారని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. భారత్ తీసుకున్న సాహసోపేత ఆర్థిక సంస్కరణల గురించి కుడా మోదీ ఈ సదస్సులో వివరించారని ష్రింగ్లా వెల్లడించారు. ఆర్థిక పునరుద్ధరణ, సరఫరా గొలుసు వైవిధ్యీకరణలో భారత్‌ను తమ భాగస్వామిగా మార్చుకోవాలని జీ20 దేశాలను మోదీ ఆహ్వానించారని పేర్కొన్నారు.
మోదీ స్పీచ్ హైలైట్స్..
- అంతర్జాతీయ ప్రయాణాలు పునరుద్ధరించడం, కరోనా టీకా ధ్రుపత్రాలను పరస్పరం గుర్తించుకోవడం వంటి అంశాలను జీ-20 సదస్సులో మోదీ ప్రధానంగా ప్రస్తావించారు.
- భారత్ స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలపాల్సి ఉన్న విషయాన్ని పేర్కొన్నారు.
- ఈ టీకాకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం లభిస్తే ఇతర దేశాలకు భారత్ మరింత సాయపడగలదని వివరించారు.
Also Read: Dehradun: లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి, నలుగురికి గాయాలు
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు
Also read: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?
Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి