సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆస్పత్రిలో ఉన్నారిప్పుడు. శనివారం రాత్రి సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో జాయినయ్యారు. అయితే... ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అసలు, కైకాలకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...


ఐదు రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో జారిపడ్డారు. పెద్దగా గాయాలు ఏమీ కాలేదు. అయితే, నొప్పులు ఉన్నాయట. శనివారం రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో కైకాల చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు అంతా బావుందని, ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలియజేశారు.


వయసురీత్యా కొన్ని రోజుల నుంచి కైకాల సత్యనారాయణ బయటకు రావడం లేదు.  సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడప్పుడూ కొందరు ప్రముఖులు ఆయన్ను ఇంటికి వెళ్లి కలిసి వస్తున్నారు. మొన్నామధ్య మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెళ్లి వచ్చారు. కైకాల పుట్టినరోజు (జూలై 25న) సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లిన చిరంజీవి కాసేపు ముచ్చటించి వచ్చారు.


Also Read: అర్ధరాత్రి హైద‌రాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?


Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?


Also Read: అందులో కాజల్ అగర్వాల్ సినిమా ఒక్కటీ లేదేంటి?


Also Read: పునీత్ రాజ్‌కుమార్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...


Also Read: పెళ్లాం లేచిపోతే.... పెళ్లి కొడుక్కి వచ్చే కష్టాలు ఏంటి?


Also Read: పునీత్ నా బాడీగార్డ్.. జిమ్ చేయడం వల్ల చనిపోలేదు, రాత్రి నుంచే..: హీరో శ్రీకాంత్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి