Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంలో ఆఖరి సంతానం పునీత్ రాజ్‌కుమార్. 1975లో మార్చి 17న జన్మించారు. అతని కంటే ముందు ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. (Image Credit/ Social Media)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఊహ తెలియని వయసులో పునీత్ నటుడిగా పరిచయమయ్యారు. ఆరు నెలల వయసులో 'ప్రేమద కనిక' సినిమాతో తెరంగేట్రం చేశారు. అప్పుడు అతనికి పేరు కూడా పెట్టలేదు. ఆ సినిమా టైటిల్స్‌లో 'మాస్టర్ రాజ్ కుమార్' అని వేశారు. బాల నటుడిగా రెండో సినిమా నుండి లోహిత్ అని వేశారు. (Image Credit/ Social Media)
'చలీసువ మాడగళు' సినిమాకు బాలనటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అందించే పురస్కారం అందుకున్నారు. అప్పటికి అతని వయసు ఏడేళ్లు. (Image Credit/ Social Media)
పునీత్ చైల్డ్ హుడ్ ఫెవరెట్ సాంగ్ ఏంటో తెలుసా? 'అయామ్ ఏ డిస్కో డ్యాన్సర్'! అవును... మిథున్ చక్రవర్తి పాటే. (Image Credit/ Puneeth Rajkumar Facebook)
'బెట్టాద హువు' సినిమాతో బాలనటుడిగా పునీత్ నేషనల్ అవార్డు అందుకున్నారు. అప్పుడు ఆయన వయసు ఏడేళ్లు. (Image Credit/ Social Media)
బాలనటుడిగా పునీత్ చివరి సినిమా 'శివ మెచ్చిన కన్నప్ప'. అందులో శివుడిగా రాజ్ కుమార్ అతిథి పాత్రలో కనిపించారు. శివ రాజ్ కుమార్ హీరోగా నటించారు. ఈ సినిమాతో లోహిత్ నుండి పునీత్ గా పేరు మారింది. (Image Credit/ Puneeth Rajkumar Facebook)
హీరోగా పరిచయం కావడానికి ముందే పునీత్ వివాహమైంది. ఓ స్నేహితుడి ద్వారా పరిచయమైన అశ్వినిని ప్రేమించి పెళ్లి (డిసెంబర్ 1, 1999) చేసుకున్నారు. ఆమెది బెంగళూరు. (Image Credit/ Social Media)
'అప్పు' (2002) సినిమాతో పునీత్ హీరోగా పరిచయమయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా పునీత్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. (Image Credit/ Social Media)
'అరసు' (2007)తో హీరోగా పునీత్ తొలి అవార్డు అందుకున్నారు. ఆ సినిమాతో ఆయనకు ఫిల్మ్ ఫేర్ వచ్చింది. (Image Credit/YouTube)
'మిలన' (2007)తో హీరోగా పునీత్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. ఆ సినిమా 365 రోజులు ఆడింది. (Image Credit/ Social Media)
కర్ణాటకలో పునీత్‌ను చాలామంది రాజ్‌కుమార్‌తో పోలుస్తారు. నటనలో, దానంలో తండ్రికి తగ్గ తనయుడు అని అంటుంటారు. అయితే, పునీత్ మాత్రం తండ్రితో పోల్చవద్దని చెప్పేవారు. తనను తల్లి గారాబంగా పెంచారని పునీత్ అంటుండేవారు. తల్లికి పునీత్ చాలా క్లోజ్. (Image Credit/ Puneeth Rajkumar Facebook)
పునీత్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారి పేర్లు ధ్రితి, వందిత. (Image Credit/ Social Media)
పునీత్ హీరో మాత్రమే కాదు. నిర్మాత కూడా. పి.ఆర్.కె ప్రొడక్షన్స్ (పునీత్ రాజ్ కుమార్) స్థాపించి... తొలి ప్రయత్నంగా 'కావలుధారి' నిర్మించారు. ఆ సినిమాను తెలుగులో 'కపటధారి'గా సుమంత్ రీమేక్ చేశారు. ఆయన నిర్మించిన 'ఫ్రెంచ్ బిర్యానీ', 'ఫ్యామిలీ ప్యాక్' సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. (Image Credit/ Puneeth Rajkumar Facebook)
పునీత్, రజనీకాంత్ మధ్య వయసులో చాలా వ్యత్యాసం ఉంది. కానీ, నటులుగా ఇద్దరి మధ్య తేడా ఒక్క ఏడాదే. రజనీకాంత్ 'అపూర్వ రాగంగాళ్' (1975) విడుదలైన మరుసటి ఏడాది బాలనటుడిగా పునీత్ తొలి సినిమా 'ప్రేమద కనిక' (1976) విడుదలైంది. (Image Credit/ Puneeth Rajkumar Facebook)
'మీలో ఎవరు కోటీశ్వరుడు' కన్నడ వెర్షన్ 'కన్నడద కొట్యాధిపతి'తో టీవీ హోస్ట్ అవతారం ఎత్తారు పునీత్. ఓ టీవీ షో 'నేత్రావని' ప్రొడ్యూస్ చేశారు. (Image Credit/ Puneeth Rajkumar Facebook)
పునీత్ గాయకుడు కూడా! పాటలు పాడటం ద్వారా వచ్చే ఆదాయాన్ని సహాయ కార్యక్రమాలకు వినియోగించేవారు. (Image Credit/ Puneeth Rajkumar Facebook)
శివ రాజ్ కుమార్ నటించిన 'భజరంగీ 2' కన్నడ, తెలుగు భాషల్లో శుక్రవారం విడుదలైంది. బెంగళూరులో నిర్వహించిన ఆ సినిమా వేడుకలో యష్, శివతో కలిసి పునీత్ డ్యాన్స్ చేశారు. అదే ఆయన పాల్గొన్న చివరి సినిమా వేడుక. (Image Credit/ Social Media)
'కిల్లింగ్ వీరప్పన్', 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు శివ రాజ్ కుమార్ తెలుసు. పునీత్ మరో అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా కన్నడలో హీరో. (Image Credit/ Social Media)
పునీత్ కు సైక్లింగ్, ఫిట్నెస్ అంటే ఇష్టం. ఎప్పుడూ ఫిట్ గా ఉండేవారు. ఓ సినిమా కోసం బాడీ బిల్డ్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి మరణించారు. పునీత్ హీరోగా రెండు సినిమాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. (Image Credit/ Puneeth Rajkumar Facebook)