వ్యక్తిగత గుర్తింపునకు సంబంధించి 'ఆధార్ కార్డ్' దేశంలోనే ఇప్పుడు అతి ముఖ్యమైన డాక్యుమెంట్! పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ఆసుపత్రులు, బీమా, ఆర్థిక లావాదేవీలు సహా ఎన్నో అవసరాలకు ఆధార్‌ను ఉపయోగిస్తున్నాం. అందుకే దీనిని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. మనకు తెలియకుండా ఇతరులెవరైనా మన ఆధార్ కార్డ్ వాడుతున్నారేమో ఓ కన్నేయాలి!
ఒకవేళ మీ ఫోన్‌కు ఆధార్ ఓటీపీ రాకపోతే దానిని మరెవరైనా మిస్ యూజ్ చేసే ప్రమాదం ఉంటుంది. అలా మీకు అనుమానం వస్తే కొన్ని సింపుల్ స్టెప్స్‌లో ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందో లేదో తెలుసుకోవచ్చు.
ఇలా తెలుసుకోండి
* మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందో లేదో తెలుసుకొనేందుకు మొదట ఆధార్ వెబ్‌సైట్ UIDAIకి లాగిన్ అవ్వాలి.
* తర్వాత ఆధార్ సర్వీసెస్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని సెలక్ట్ చేయాలి.
* మీ ఆధార్ సంఖ్య, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
* డ్రాప్‌డౌన్ మెనూ లోంచి 'జనరేట్ మెనూ'ను ఎంచుకోవాలి.
* మీ ఓటీపీ సంఖ్యను ఎంటర్ చేయాలి.
* ఇప్పుడు మీ 'ఆధార్ అథంటికేషన్ హిస్టరీ' చూడొచ్చు.
* మీ హిస్టరీ చూశాక ఆధార్ కార్డును దుర్వినియోగం చేశారో లేదో తెలుసుకోవచ్చు.
* ఈ ప్రాసెస్ సరిగ్గా జరగాలంటే మీ ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ అవ్వాలి.
* ఓటీపీ రాకపోతే అథంటికేషన్ హిస్టరీ చూడలేరు. కాబట్టి ఫోన్ నంబర్ లింక్ చేసుకోవాలి.
* ఆధార్ మిస్‌యూజ్ అయినట్టు తెలిస్తే యూఐడీఏఐ ఎమర్జెన్సీ నంబర్‌కు ఫిర్యాదు చేయండి.
Also Read: EPF Interest: కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం.. ఈపీఎఫ్ ఖాతాల్లోకి నగదు జమ అయ్యేది ఎప్పుడంటే..!
Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోకు సెబీ అనుమతి.. షేర్ల ధర, విలువ, లిస్టింగ్ వివరాలు ఇవే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
x