గోద్రేజ్‌ గ్రూప్‌ విభజనకు రంగం సిద్ధమవుతోంది! అన్నదమ్ములు వ్యాపారాలను పంచుకోనేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. 124 ఏళ్ల ఈ వ్యాపార సామాజ్ర్యం విలువ ప్రస్తుతం 4.1 బిలియన్‌ డాలర్లు.  సబ్బుల నుంచి గృహోపకరణాల రంగంలో గోద్రేజ్‌ తనదైన ముద్ర వేసింది. ఆస్తుల పంపకం సజావుగా సాగేందుకు కుటుంబ సభ్యులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారని తెలిసింది.


గోద్రేజ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌గా ప్రస్తుతం ఆది గోద్రేజ్‌ (79) ఉన్నారు. ఆయనే వ్యాపారాలను నడిపిస్తున్నారు. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, గోద్రేజ్‌ అగ్రోవెట్‌కు ఆయన సోదరుడు నదీర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక గ్రూప్‌లోనే కీలకమైన గోద్రేజ్‌ అండ్‌ బాయ్‌సీ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీని వారి కజిన్‌ జమ్‌షైద్‌ ఎన్‌ గోద్రేజ్‌ నడిపిస్తున్నారు. కొన్ని వ్యాపారాల్లో విఫలమైన తర్వాత 1897లో అర్దేశిర్‌ గోద్రేజ్‌ ఈ సంస్థను స్థాపించడం గమనార్హం.


ఆది, నదీర్‌, జమ్‌షైద్‌, వారి సోదరి స్మితా గోద్రేజ్‌ చూసుకుంటున్న వ్యాపారాలను స్పష్టంగా రెండుగా విభజించాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారని తెలిసింది. విభజనపై గోద్రేజ్‌ కుటుంబాన్ని సంప్రదించగా 'వాటాదారుల విలువను పెంచేందుకు కొన్నేళ్లుగా సుదీర్ఘ వ్యూహాత్మక ప్రణాళికలపై పనిచేస్తున్నాం' అని తెలిపారు. 'ఆ కసరత్తులో భాగంగా మేం పరోక్ష భాగస్వాముల అభిప్రాయాలనూ తీసుకుంటున్నాం. కుటుంబ సభ్యుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి' అని వెల్లడించారు.


తమకు సన్నిహితులైన బ్యాంకర్లు నిమేశ్‌ కంపాని, ఉదయ్‌ కొటక్‌ న్యాయ రంగంలోని జియా మోడి, సిరిల్‌ ష్రాఫ్‌ తదితరుల సలహాలను గోద్రేజ్‌ కుటుంబం తీసుకుంటోందని సమాచారం. గ్రూపులో 23 శాతంగా ఉన్న ప్రమోటర్‌ వాటా ట్రస్టుల్లో ఉందని అంటున్నారు. కుటుంబ సభ్యులకు గ్రూపులోని అన్ని వ్యాపారాల్లో వాటాలు ఉన్నాయి. ఇప్పటికే వారసులు వ్యాపార బాధ్యతలు తీసుకోవడంతో ఆది గోద్రేజ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుత యువతరం కుటుంబ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చొరవ చూపిస్తున్నారని తెలుస్తోంది!


Also Read: EPF Interest: కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం.. ఈపీఎఫ్ ఖాతాల్లోకి నగదు జమ అయ్యేది ఎప్పుడంటే..!


Also Read: JioPhone Next: జియో స్మార్ట్‌ఫోన్ ధర ప్రకటించిన కంపెనీ.. రూ.1,999కే కొనేయచ్చు.. రీచార్జ్ ప్లాన్లు ఇవే!


Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోకు సెబీ అనుమతి.. షేర్ల ధర, విలువ, లిస్టింగ్‌ వివరాలు ఇవే


Also Read: Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి