రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధేశ్యామ్' సినిమా ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ ఆ ఆంచనాలను మరింత పెంచేసింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాపై వందల కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. 


ఆయన సినిమాలపై ఇన్వెస్ట్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఎక్కువశాతం ఫైనాన్స్ మీద ఆధారపడాల్సిందే. అందులోనూ.. రెండు కరోనా దశలు చూసిన సినిమా కావడం.. అసలు విడుదలవుతుందా లేదా అంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేసిన సినిమా కావడంతో.. దీనికి ఫైనాన్స్ దొరుకుతుందా అనే సందేహాలు కూడా కలిగాయి. ఫైనల్ గా చూసుకుంటే ఈ సినిమా కోసం మూడు వందల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారని వార్తలొస్తున్నాయి.


Also Read: 'ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల్లా కలిసున్నాం..' బాలయ్య ఎమోషనల్ స్పీచ్..


అయితే ఇందులో సొంత పెట్టుబడి ఎంత..? ఫైనాన్స్ ఎంతనే వివరాలపై క్లారిటీ లేనప్పటికీ యూవీ క్రియేషన్స్ కేవలం 'రాధేశ్యామ్' సినిమా ఫైనాన్స్ మీద రూ.50 నుంచి రూ.60 కోట్లు వడ్డీలకు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా దాదాపు రెండేళ్లపాటు నిర్మాణంలోనే ఉంది. దానివలన వడ్డీల భారం తక్కువేమీ ఉండదు. ఆ భారమే యాభై నుంచి అరవై కోట్ల రేంజ్ అని టాలీవుడ్ టాక్. ఈ సినిమా విడుదలయ్యాక కచ్చితంగా లాభాలు వస్తాయని నమ్ముతున్నారు. 


ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే క‌నిపిస్తోంది. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ కూడా ఇందులో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ చేతి రేఖ‌ల‌ను ఆధారంగా చేసుకుని భ‌విష్య‌త్తును చెప్పేసే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు.