'ఓ కందిసేను కాడ... డాంటకు డడన
కన్ను కలిపితే డాంటకు డడన
పంపుషెడ్డు కాడ... డాంటకు డడన
పైట తగిలితే డాంటకు డడన...
లడ్డుండా! లడ్డుండా!!' అని బంగార్రాజు పాట పాడుతున్నాడు.
అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయనా'కు ప్రీక్వెల్ ఇది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన కల్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో 'లడ్డుండా' పాటను ఈ రోజు (మంగళవారం) విడుదల చేశారు. పైన చెప్పినవి అందులో లిరిక్స్.
పాట ప్రారంభంలో కొన్ని లైన్లను నాగార్జున పాడటం విశేషం. 'బాబూ తబలా... అబ్బాయ్ హార్మోనీ... తానన నన డాంటకు డడన' అని నాగార్జున పాడగా... సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ 'రాజుగారూ డాంటకు డడన అనగా ఏమి?' అని అమాయకంగా అడిగారు. అప్పుడు 'ఓరి బుడ్డోడా ఇంతకాలం తెలుసుకోకుండా ఏం చేస్తున్నావ్ రా! అడగాలి కదా! నేర్పిస్తాం కదా! బంగారు పాపలు' అని నాగార్జున చెప్పడంతో పాట ప్రారంభమైంది. భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఈ పాటను నాగార్జునతో పాటు ధనుంజయ, మోహన భోగరాజు, నూతన మోహన్, హరిప్రియ పాడారు.
నాగార్జున, రమ్యకృష్ణ ఓ జంటగా... అక్కినేని నాగ చైతన్య, 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి మరో జంటగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ పతాకాలపై అక్కినేని నాగార్జున సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..
Also Read: మహేష్ బరువు బాధ్యతలు తీసుకుంటాడా? చూద్దామంటున్న నాగార్జున!
Also Read: 'రాజా విక్రమార్క' సినిమాకు... జేడీ లక్ష్మీనారాయణకు ఓ సంబంధం ఉంది! అదేంటో తెలుసా?
Also Read: మారుతితో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Also Read: ఖం... ఖం... ఖంగుమంది 'అఖండ' శంఖం! ధర్మభేరి శబ్దం... చెయ్యమంది యుద్ధం!
Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
Also Read: బండ్ల గణేష్... పవన్‌ను జాగ్రత్తగా చూసుకుంటావా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి