అనగనగా ఓ మిడిల్ క్లాస్ తండ్రి. పాతిక లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఆ తర్వాత కన్ను మూశాడు. అప్పు చేసిన సంగతి కుటుంబ సభ్యులకు తెలియదు. ఎందుకు అంత డబ్బు లోన్‌గా తీసుకున్నాడ‌నేది అసలు తెలియదు. ఆ లోన్ కొడుకు మీద వచ్చి పడింది. నెల నెలా రూ. 30 వేలు ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి. చూస్తే చేతిలో చిల్లి గవ్వ లేదు. అప్పుడు కొడుకు ఏం చేశాడు? తండ్రి ఆ పాతిక లక్షలు ఏం చేశాడు? తెలియాలంటే... 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ చూడాలి.


పాతిక లక్షలు లోన్ తీసుకుని, కొడుకు మీద ఆ భారం వేసిన తండ్రిగా సీనియర్ నరేష్, అతని కుమారుడిగా సంగీత్ శోభన్ నటించిన వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'. నిహారికా కొణిదెల నిర్మించారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. సంగీత్ శోభన్ సరసన సిమ్రాన్ శర్మ కథానాయికగా, అతని తల్లి పాత్రలో తులసి నటించారు. నవంబర్ 19 నుంచి జీ5 ఓటీటీ వేదికలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నాగార్జున ఈ రోజు సినిమా ట్రయిలర్ విడుదల చేశారు.






"ట్విస్ట్ మామూలుగా లేదుగా. బరువు బాధ్యతలను మహేష్ తీసుకుంటాడా? చూద్దాం! ట్రైలర్ చూశాక ఈ ఫ్యామిలీ స్టోరీ చూడాలని నాకు కూడా అనిపించింది. మన అందరికీ ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ఇవ్వబోతుంది " అని నాగార్జున అన్నారు. ఆయనకు వెబ్ సిరీస్ టీమ్ థాంక్స్ చెప్పింది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందర్నీ ఆకట్టుకునే సిరీస్ ఇదని నిహారికా కొణిదెల తెలిపారు. ట్రైలర్లో నరేష్, సంగీత్ శోభన్ మధ్య డైలాగులు వినోదాత్మకంగా ఉన్నాయి. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ సన్నివేశాలు ఆసక్తి కలిగించాయి. అమ్మాయి వంద రూపాయలు అడిగితే... జేబు తడుముకోగా రూపాయి మాత్రమే ఉండటం, అది చూసి హీరోయిన్ వెళ్లడంతో తర్వాత ఏమైందనేది ఆసక్తిగా మారింది. 



Also Read: 'రాజా విక్రమార్క' సినిమాకు... జేడీ లక్ష్మీనారాయణకు ఓ సంబంధం ఉంది! అదేంటో తెలుసా?
Also Read: మారుతితో ప్రభాస్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Also Read: ఖం... ఖం... ఖంగుమంది 'అఖండ' శంఖం! ధర్మభేరి శబ్దం... చెయ్యమంది యుద్ధం!
Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
Also Read: బండ్ల గ‌ణేష్‌... ప‌వ‌న్‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటావా?
Also Read: పాట కష్టం తెలిసినోడు... కొన్నేళ్లుగా రాయనోడు... మళ్లీ పవన్ కోసం రాశాడు!
Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి