Weather Updates In AP: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. తమిళనాడులో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను సైతం భారత వాతావరణ విభాగం అలర్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం.. ప్రస్తుతం పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతం దగ్గరలోని దక్షిణ ఆంధ్ర - ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతంపై ఉంది. ఇది మరింత బలపడి రాగల 24 గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరం వైపునకు ప్రయాణించే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3 .1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ఫలితంగా తెలికపాటి జల్లులు కురవనుండగా.. ఏపీలో రెండు, మూడు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాఖ వెల్లడించింది.
Also Read: స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి.. నేడు ధరలు ఇలా..
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. పశ్చిమ నైరుతి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం భావిస్తోంది.
ఏపీకి రెయిన్ అలర్ట్..
ఏపీలో ఆదివారం వరకు ఓ మూడు రోజులపాటు వర్షాలు కురువయనున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నేడు ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ అల్పపడీనం బలపడి వాయవ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏపీలో ముఖ్యంగా రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
Also Read: ఈ నగరాల్లో పెరిగిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో స్థిరంగా.. నేటి ధరలు ఇవీ..
మత్స్యకారులకు హెచ్చరిక..
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఏర్పడుతున్నందున మత్స్యకారులు విశాఖపట్నం సహా తీరప్రాంతాల్లో నవంబర్ 13 వరకు చేపల వేటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు హెచ్చరించారు. ఉపరితల ఆవర్తనం, నేడు ఏర్పడబోయే అల్పపీడనం కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..