'నాటు... నాటు... ఊర నాటు' - 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'లో రెండో పాట ప్రోమో ఈ రోజు (మంగళవారం) విడుదలైంది. ఆల్రెడీ ఈ పాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డాన్స్ చేస్తున్న స్టిల్ ఒకటి మూడు రోజుల విడుదల చేశారు. దాంతో పాట మీద అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగ్గట్టు 'నాటు... నాటు' ఉందని చెప్పాలి.

Continues below advertisement





'నా పాట సూడు... నా పాట సూడు... నా పాట సూడు...నాటు నాటు నాటు నాటు నాటు నాటు... వీర నాటు... ఊర నాటు' అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ప్రోమో చూస్తుంటే కొన్ని రోజులు పబ్బుల్లో, క్లబ్బుల్లో, ఫంక్షన్లలో బాక్సులు బద్దలయ్యేలా మోగేట్టు ఉంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఫుల్ సాంగును రేపు (బుధవారం) సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ పాట హీరోలిద్దరి అభిమానులను ఆకట్టుకోవడం ఖాయమని ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. అసలు, ఇద్దరు ఓ పాటకు డాన్స్ చేయడం ఐఫీస్ట్ అనేది నార్మల్ ఆడియన్స్ ఫీలింగ్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ప్రోమో విడుదల చేశారు. బుధవారం ఐదు భాషల్లోనూ సాంగ్ రిలీజ్ కానుంది.

ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, అలీసన్ డూడీ, రాహుల్ రామకృష్ణ  తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 


 



Also Read: సంక్రాంతి తర్వాతే కొరటాల సెట్స్‌కు యంగ్ టైగర్... పక్కా ప్లాన్ రెడీ!
AlsoRead: సిక్స్‌ప్యాక్‌ బాడీ వల్లే మూడు సినిమా ఛాన్సులు... నాకు ఫిజిక్ అడ్వాంటేజే!
Also Read: కందిసేను కాడ... పంపుషెడ్డు కాడ... డాంట‌కు డ‌డ‌న‌! 'బంగార్రాజు' లడ్డుండా!!
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..
Also Read: మహేష్ బరువు బాధ్యతలు తీసుకుంటాడా? చూద్దామంటున్న నాగార్జున!
Also Read: ఖం... ఖం... ఖంగుమంది 'అఖండ' శంఖం! ధర్మభేరి శబ్దం... చెయ్యమంది యుద్ధం!
Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
Also Read: బండ్ల గ‌ణేష్‌... ప‌వ‌న్‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటావా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి