బాహుబలి తరువాత దర్శకధీరుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్జీఆర్ హీరోలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో పాత్రను, పాటనూ రివీల్ చేస్తూ వస్తోంది చిత్రయూనిట్. మొన్నటికి మొన్న ‘నాటు నాటు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. అందులో తారక్, చెర్రీలు డ్యాన్సుతో ఇరగదీశారు. వారిద్దరి డ్యాన్స్ మూమెంట్లు మళ్లీమళ్లీ చూడాలనిపించేలా ఉన్నాయి. ఆ పాట విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక యూట్యూబ్ ఇండియా ఈ సినిమాపై స్పందించకతప్పలేదు. తమ ట్విట్టర్ ఖాతాలో ‘నిజాయితీగా చెబుతున్నాం... రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్ ఇప్పటికీ 0.5X స్పీడును ఫీలయ్యేలా చేస్తోంది’ అంటూ మెచ్చుకుంది.
ఆ ట్వీట్ ను ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ రీట్వీట్ చేసింది. ‘నిజానికి మేము 2X వేగంతో ఎడిట్ చేయాలనుకున్నాం... కానీ పాటలో మన డ్యాన్స్ డైనమైట్లు (చెర్రీ, ఎన్టీఆర్) మెరుపువేగంతో చేశారు. కాబట్టి సాధారణ వేగంతోనే ఎడిట్ చేయడం, ఆశ్చర్యపోవడం తప్ప మాకు వేరే మార్గం లేదు’ అని రాసుకొచ్చారు. క్రెడిట్ అంతా హీరోలకే ఇచ్చేసింది చిత్రయూనిట్. వారు అంత అద్భుతంగా డ్యాన్సు చేయడం వల్లే... ఇంత హిట్ కొట్టిందని వారు భావిస్తున్నారు. నాటు నాటు డ్యాన్సు చూసిన వారెవరైనా ఆ విషయాన్ని ఒప్పుకోకతప్పదు. ఈ ఊరమాస్ సాంగ్ ను చంద్రబోస్ రాయగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్ గా చేశారు. కీరవాణి సంగీతంలో రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడాడు.
Also Read: టికెట్ ధరలు పెంచుతారా? లేదా? ఏపీ ఆన్‌లైన్ టికెట్ల విధానంలో స్పష్టత వచ్చిందా? లేదా!?Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రెడీ... టీజర్ విడుదల ఎప్పుడంటే?
Also Read: సంతాపమా... ప్రచారమా? ఏంటిది తలైవా?? రజనీకాంత్‌పై నెటిజన్స్ ఫైర్
Also Read: 'పుష్పక విమానం' చూశాక... విమానం ఎక్కి విదేశాలు చెక్కేస్తున్న విజయ్ దేవరకొండ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి